మహేశ్‌కి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ పంపిన రష్మిక
close
Published : 30/06/2020 12:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌కి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ పంపిన రష్మిక

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో ప్రస్తుతం సినీ తారలందరూ ఇళ్లకే పరిమితమై ఖాళీ సమయాన్ని కుటుంబసభ్యులతో ఆస్వాదిస్తున్నారు. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’తో ఆకట్టుకున్నారు మహేశ్‌బాబు-రష్మిక జోడి. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి ఇళ్లలో వారు ఉంటూ సరదాగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో కూర్గ్‌ నుంచి మహేశ్‌ కుటుంబానికి రష్మిక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ పంపారు. అదేంటో తెలుసా? మామిడికాయ పచ్చడికి సరిపడా సరంజామా బాక్స్‌.

రష్మిక పంపిన ఈ గిఫ్ట్‌ను మహేశ్ సతీమణి నమ్రత అభిమానులతో పంచుకున్నారు. ‘కూర్గ్‌ నుంచి  ఇవన్నీ మాకు పంపినందుకు థ్యాంక్యూ రష్మిక. కొవిడ్‌ సమయంలో మాకు అందిన మొదటి గిఫ్ట్‌’ అని పేర్కొంటూ మాన్‌సూన్‌సీజన్‌, మ్యాంగోపికిల్‌ హ్యాష్‌ట్యాగ్స్‌ జత చేశారు. దీనికి రష్మిక జవాబిస్తూ ‘మీకు అవి నచ్చుతాయని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.

సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నారు మహేశ్‌, రష్మిక. ప్రస్తుతం పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం కోసం మహేశ్‌ సిద్ధమవుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్‌ ‘పుష్ప’లో కథానాయికగా నటిస్తున్నారు రష్మిక. లాక్‌డౌన్‌ కారణంగా ‘పుష్ప’ చిత్రీకరణ వాయిదా పడగా, మహేశ్‌ ‘సర్కారు వారిపాట’ పట్టాలెక్కాల్సి ఉంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని