‘జెర్సీ’ యూనిట్‌కు ధన్యవాదాలు: షాహీద్‌ - Shahid Kapoor wraps up Jersey says shooting during Covid is nothing short of a miracle
close
Published : 16/12/2020 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జెర్సీ’ యూనిట్‌కు ధన్యవాదాలు: షాహీద్‌

ముంబయి: బాలీవుడ్‌ యువ నటుడు షాహీద్‌ కపూర్‌ నటించిన ‘జెర్సీ’ తాజాగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా షాహీద్‌ ధన్యవాదాలు తెలుపుతూ, తన భావాలను సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. తెలుగులో నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో బాలీవుడ్‌లోకి రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

‘కొవిడ్ సమయంలో 47 రోజుల పాటు షూటింగ్‌ చేశాం. ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం టీమ్‌ను చూసి ఎంతో గర్వంగా భావిస్తున్నాను. ఇది ఓ అద్భుతంలా ఉంది. తమ జీవితాలకు ప్రమాదం అని తెలిసినా, రోజూ సెట్‌కు వచ్చి షూటింగ్‌ చేశారు. అందుకు వారందరికీ చాలా ధన్యవాదాలు’ అని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘కొన్ని కథలు మనసుకు చాలా హత్తుకుంటాయి. అలాంటిదే ఈ ‘జెర్సీ’. మబ్బుల్లోంచి వచ్చే సూర్యోదయం వంటిది ఈ చిత్ర కథ. మనసు దేనికీ లొంగకుండా ఆశయ సాధనలో గొప్ప విజయాన్ని సాధించేదే ఈ చిత్రం. అదే విధంగా మనందరం ఈ కరోనాతో పోరాడుతున్నాం. త్వరలోనే దీనిని తరిమికొడదాం’ అంటూ ఆయన రాసుకొచ్చారు. అలాగే ఓ ఫొటోను షేర్‌ చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని