
చెన్నై: శరీరాకృతిని మార్చుకునే క్రమంలో ఫిట్‌గా మారి.. లగ్జరీ కారును బహుమతిగా అందుకున్నారు నటుడు శింబు. సాధారణంగా కొంచెం బొద్దుగా కనిపించే ఈ హీరో.. లాక్డౌన్ సమయంలో షూటింగ్స్ లేకపోవడంతో శరీరాకృతిపై దృష్టి పెట్టారు. ట్రైనర్ సాయంతో జిమ్‌లో వర్కౌట్లు, డ్యాన్స్, యోగా.. ఇలా ఎన్నో విధాలుగా శ్రమించి సన్నబడ్డారు. ఇటీవల తన ఫిట్నెస్ ట్రైనింగ్‌కు సంబంధించిన ఓ ప్రత్యేకమైన వీడియోని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. శింబు లుక్ చూసి అభిమానులు సైతం ఫిదా అయ్యారు.
శింబు కథానాయకుడిగా నటిస్తున్న ‘ఈశ్వరన్’ సినిమా కోసమే ఆయన సన్నబడినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ‘ఈశ్వరన్’ తర్వాత వచ్చే ‘మానాడు’ చిత్రంలో కూడా ఆయన ఇదే లుక్‌లో కనిపించనున్నారట. అయితే, వృత్తిపట్ల, ఫిట్నెస్ విషయంలో శింబు చూపించిన చొరవకి ఆయన తల్లి ఉషా మురిసిపోయారు. మినీ కూపర్(MINI COOPER) బ్రిటిష్ రేసింగ్ కారును శింబుకు బహుమతిగా ఇచ్చి.. ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కారు ధర దాదాపు రూ. 50లక్షలు ఉండొచ్చని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి
- అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్
- నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్
- భారత్‌తో పోల్చాలంటే భయమేస్తోంది: ఛాపెల్
- అట్టుడుకుతున్న రష్యా!
- పంత్ వచ్చి టీమ్ ప్లాన్ మొత్తాన్ని మార్చేశాడు
- టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య
- నిజమైన స్నేహానికి అర్థం భారత్: అమెరికా
- వేదికపై కళ్లు తిరిగిపడిపోయిన డైరెక్టర్
- ఆ రోజు సిరాజ్‌ను ఎందుకు రావొద్దన్నానంటే...