close
అవీ.. ఇవీ..
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వావ్‌.. ఊపిరి తీసుకోకుండా పాట పాడి..!

శ్వేతా మోహన్‌ గీతం విన్నారా?

హైదరాబాద్‌: ఊపిరి తీసుకోకుండా మాట్లాడటమే ఎంతో కష్టం. అలాంటిది పాట పాడటమంటే మాటలు కాదు. కానీ ప్రముఖ గాయని శ్వేతా మోహన్‌ బ్రీత్‌ లెస్‌ గీతం ఆలపించి, అందరి దృష్టిని మరోసారి ఆకర్షించారు. అక్షిత్‌ శశికుమార్‌, అనహిత భూషణ్‌ జంటగా నటిస్తున్న సినిమా ‘సీతాయణం’. ప్రభాకర్‌ ఆరిపాక దర్శకుడు. పద్మనాభ్‌ భరద్వాజ్‌ స్వరాలు అందించిన ఈ సినిమాలోని ‘మనసు పలికే నీ మాటనే..’ అనే గీతాన్ని శ్వేతా మోహన్‌ పాడారు. ఊపిరి తీసుకోకుండా చరణం పాడి, శభాష్‌ అనిపించుకున్నారు.

ఈ సందర్భంగా శ్వేతా మోహన్‌ మాట్లాడుతూ.. ‘‘సీతాయణం’ సినిమాకు పద్మనాభ్‌ భరద్వాజ్‌ అద్భుతమైన బాణీలు అందించారు. ఈ చిత్రం కోసం కన్నడ, తెలుగులో చక్కటి సెమీ క్లాసికల్‌ గీతం పాడాను. బ్రీత్‌లెస్‌ చరణం పాడటం ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. ఇప్పటికే ఎంతో మంది బ్రీత్‌ లెస్‌ సాంగ్స్‌ పాడారు. కానీ నాకు ఇది తొలి అనుభవం. ఈ అవకాశమిచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

1985లో నేపథ్య గాయని సుజాతా మోహన్‌, కృష్ణ మోహన్‌ దంపతులకు శ్వేతా మోహన్‌ జన్మించారు. అక్కడే పెరిగిన ఆమె చెన్నైలోని స్టెల్లా మారిస్‌ కళాశాలలో గ్యాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గత కొన్నేళ్లుగా హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 583 గీతాలు పాడటం విశేషం. ఉత్తమ గాయనిగా నాలుగు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, కేరళ, తమిళనాడు రాష్ట్ర అవార్డులు సొంతం చేసుకున్నారు. ‘బాంబే’లోని ‘కుచ్చి కుచ్చి కూనమ్మా..’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే!’లోని ‘చెలి చమకు కనులు..’, ‘రోబో’లోని ‘బూమ్‌ బూమ్‌ రోబో రా..’, ‘ఖలేజా’లోని ‘పిలిచే పెదవులపైన..’, ‘రంగం’లోని ‘నెమలి కులుకుల..’, ‘శ్రీరామరాజ్యం’లోని ‘సీతా రామ చరితం..’, ‘రామ రామ అనే..’, ‘100% లవ్‌’లోని ‘పంతం ఎక్కడో..’, ‘గబ్బర్‌ సింగ్‌’లోని ‘దిల్‌సే..’, ‘సింగం 2’లోని ‘తెలియదులే..’, ‘జనతా గ్యారేజ్‌’లోని ‘నీ సెలవడిగీ..’, ‘సాహో’లోని ‘బేబీ..’ తదితర హిట్‌ గీతాలన్నీ శ్వేతా మోహన్‌ ఆలపించినవే. గాయని చిత్ర, తల్లి సుజాతా మోహన్‌ తనకు స్ఫూర్తి అని శ్వేతా మోహన్‌ పలుమార్లు చెప్పారు. ఆమె 2011లో ప్రియుడు అశ్విన్‌ను మనువాడారు. వీరికి ఓ కుమార్తె.




Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు