close
బాలీవుడ్
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సోనూ సూద్‌@ 24.. పాత ఫొటో వైరల్‌!

దిల్లీ: సోనూసూద్‌.. మొన్నటి వరకు తెరపై కనిపించే విలన్ మాత్రమే. ఇప్పుడు అదే సోనూసూద్‌ రియల్‌ లైఫ్‌ హీరో. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కాదనకుండా సాయం చేస్తున్న ఈ నటుడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సామాజిక మాధ్యమాల వేదికగా అభినందనలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలో సోనూసూద్‌కు సంబంధించిన 90ల నాటి చిత్రం ఒకటి బయటకి రావడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

అప్పటికి సోనూసూద్‌ వయసు 24. ముంబయిలోని బోరివాలి నుంచి చర్చిగేట్‌కు ప్రయాణించేందుకు పశ్చిమ రైల్వే శాఖ ఆయన పేరుతో ఓ ఐడీ కార్డును, మంత్లీ పాస్‌ను జారీ చేసింది. దాని ధర అప్పట్లో రూ.420. 1998 మార్చి ఆరో తేదీతో దాని గడువు ముగిసినట్లుగా ఉంది. అయితే, ఆ ఐడీ కార్డును, టికెట్ ఫొటోను ట్వీట్‌ చేస్తూ.. ‘‘అప్పట్లో రూ.420 మంత్లీ పాస్‌తో సోనూసూద్‌ ప్రయాణించేవాడు. నిజంగా కష్టపడే వాడే ఇతరుల బాధను అర్థం చేసుకుంటాడు’’ అనే వ్యాఖ్యను జతచేశాడు. ఆ ట్వీట్‌ను సోనూసూద్‌ రీట్వీట్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

ఇటీవల వలస కార్మికుల కోసం సోనూ సొంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వారి కోసం ఓ టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేశాడు. అలాగే ముంబయిలోని వైద్య సిబ్బందికి ఓ హోటల్‌ను ఏర్పాటు చేసిన సోనూ.. కోచిలో చిక్కుకున్న 177 మంది కోసం ఏకంగా ఓ విమానాన్నే ఏర్పాటు చేసి తన మంచి మనసును చాటుకున్నాడు. ‘ఇలా 24 గంటలూ కష్టపడుతున్న మీరు.. ఇంకెప్పుడు నిద్రపోతారు’ అంటూ ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సింపుల్‌గా.. ‘అందరూ ఇళ్లకు వెళ్లాక’  అని సమాధానం ఇవ్వడం సోనూకే చెల్లింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.