ప్రకృతిలో మనం ‘అద్దెదారులం’ : పూరీ జగన్నాథ్ - TENANTS puri musings by puri jagannadh
close
Published : 08/12/2020 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రకృతిలో మనం ‘అద్దెదారులం’ : పూరీ జగన్నాథ్

హైదరాబాద్‌: అద్దెకు లేదా ఒడంబడికకు ఏదైనా ఆస్తిని తీసుకునేదాన్ని ‘అద్దెదారు’ అంటారు. అద్దెకొచ్చిన వాళ్లు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ పేర్కొన్నారు. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన ‘టెనెంట్స్’ గురించి మాట్లాడారు. 

‘అసలు ఆ ఇల్లు వాళ్లది కాదు. అందుకే ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలి. రోజూ తుడవాలి. పైగా నెల నెల అద్దె కట్టాలి. ఇంటి యజమాని ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేసి వెళ్లిపోవాలి. వెళ్తూ వెళ్తూ మనకి యజమాని ఎలా ఇచ్చాడో మళ్లీ అలాగే అంతే శుభ్రంగా అయన చేతిలో పెట్టాలి. అంతే తప్ప ఇళ్లంతా రంధ్రాలు పెట్టకూడదు. కిటికీలు, ద్వారబంధాలు విరిచేయకూడదు. యజమానికి తెలియకుండా ఇంటిని తనఖా పెట్టడం, మద్యపానం సేవించి ఇంటిని తగలపెట్టడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఆ ఇంటికి మనం ఎప్పుడూ యజమాని కాదు. కాబట్టి యజమానిలా ప్రవర్తించకూడదు’. అని పూరీ వివరించారు.

‘ఎందుకనగా ఈ భూమ్మీద జీవించడానికి వచ్చిన మనందరం ‘అద్దెదారులమే’. ఇక్కడ ఎన్నాళ్లుంటే అన్నాళ్లు ‘అద్దెదారులుగానే’ ఉండాలి. ఈ ప్రకృతి మనది కాదు. అద్దెకు వచ్చాం ఇక్కడికి. అందుకే మీ నాన్న నీకిచ్చిన పొలాన్ని అంతే సారవంతంగా ఉంచి నీ పిల్లలకు నువ్వు ఇవ్వాలి. మీ వీధిలో పది చెట్లు ఉంటే ఇంకో పది చెట్లు నాటి వెళ్లాలి తప్ప ఉన్నవాటిని తీసేయకూడదు. అన్ని జంతువులు ప్రకృతిలో జీవిస్తాయి. ప్రకృతిని పాడుచేయకూడదు’. అని ఆయన చెప్పారు.

‘ఈ మనుషులు చేసిన అతి పెద్ద తప్పు ‘తవ్వకం’. నీటి కోసం నుయ్యిలు తవ్వితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, గనుల తవ్వకాలు మెదలుపెట్టాం. గనుల తవ్వకం అనేది లేకపోతే మనం ఇలా ఉండేవాళ్లం కాదు. అది నిజమే. కానీ, గనుల తవ్వకాల వల్ల ఉపయోగాలకంటే దరిద్రాలు ఎక్కువ జరిగాయి. నేలకోత, భూక్షయం, సింక్ హోల్స్‌, అడవుల నిర్మూలన, జీవవైవిధ్యం కోల్పోవడం, ఆనకట్ట నివాసాలు, వ్యర్థాల తొలగింపు సమస్యలు, నేల కాలుష్యం, భూగర్భ జలాల నాశనం. ఇన్ని దరిద్రాలు అద్దెకున్నవాళ్లు చేయకూడదు’. అని పూరీ పేర్కొన్నారు. 

‘మనం ఇక్కడ అద్దె సైతం కట్టడం లేదు. ఎవరూ అద్దె అడగకపోవడం వల్ల అది మనదే అనుకుంటున్నాం. పైగా ఉచితంగా ఆక్సిజన్‌ను పీల్చేస్తున్నాం. ఆసుపత్రి రేట్లలో కనుక చూస్తే మనం పీల్చే గాలికి గంటకి రూ.వెయ్యి చొప్పున మనం ప్రకృతికి కట్టాలి. అద్దె కట్టడం లేదు. ఆక్సిజన్‌కి కట్టడం లేదు. తిరిగి పెంట పెంట చేస్తే ఎలా’..? అని ఆయన ప్రశ్నించారు.

‘అద్దెదారులు’ అద్దెకు వచ్చినట్లుగా ఉండాలి. ఎక్కువ చేయకూడదు. దేవుడు నాకు ఈ జీవితాన్నిచ్చాడు. నేను దేవుని బిడ్డని. ఆ నింగి నాది.. నేల నాది.. అంటే కుదరదు. మనం ‘అద్దెదారులం’. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉందాం. అద్దె అడగని యజమాని దొరికినందుకు ఇంకా గొప్పగా, కృతజ్ఞత కలిగి ఉందాం’. అని పూరీ పిలుపునిచ్చారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని