నవంబరు నుంచి నిర్విరామంగా - Telugu News Prabhas Starer Project K Shooting Starts From November
close
Updated : 21/09/2021 09:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నవంబరు నుంచి నిర్విరామంగా

వైపు ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ చిత్రాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు నాగ్‌ అశ్విన్‌ కొత్త సినిమాపైనా దృష్టి సారిస్తున్నారు కథానాయకుడు ప్రభాస్‌. ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కుతోన్న ఈ పాన్‌ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇప్పటికే పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. విభిన్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో సోషియో ఫాంటసీగా మూవీగా రూపొందనుంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తుండగా.. దీపికా పదుకొణె నాయికగా నటిస్తోంది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వినీ దత్‌ నిర్మిస్తున్నారు. ఆయన ఈ సినిమా చిత్రీకరణ వివరాలను ఈటీవీలో ప్రసారమయ్యే ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమంలో పంచుకున్నారు. ‘‘ఈ చిత్రం కోసం ఇప్పటికే అమితాబ్‌ బచ్చన్‌పై పదిరోజుల పాటు కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. నవంబరు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి దాదాపు 13నెలల పాటు నిర్విరామంగా చిత్రీకరణ కొనసాగిస్తాం. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌, అమితాబ్‌లతో పాటు మిగతా ప్రధాన తారాగణమంతా పాల్గొంటుంది. ఇప్పటికే గ్రాఫిక్స్‌ పనులు ప్రారంభమయ్యాయి’’ అని అశ్వినీదత్‌ తెలిపారు.

ప్రభాస్‌ చేతుల మీదుగా..: సముద్రఖని, వినయ్‌ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్‌ కీలక పాత్రల్లో అశ్విన్‌ గంగరాజు తెరకెక్కించిన చిత్రం ‘ఆకాశవాణి’. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం హీరో ప్రభాస్‌ విడుదల చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని