IPL 2021: బెంగళూరు కెప్టెన్సీకీ గుడ్‌బై - Telugu News Virat Kohli to step out as RCB captain after IPL 2021 remaining season
close
Updated : 20/09/2021 10:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL 2021: బెంగళూరు కెప్టెన్సీకీ గుడ్‌బై

సారథిగా ఇదే ఆఖరి ఐపీఎల్‌: కోహ్లి

(Photo: Kohli Twitter)

దుబాయ్‌: విరాట్‌ కోహ్లి తన అభిమానులకు మరోసారి షాకిచ్చాడు. టీ20 ప్రపంచకప్‌ వరకే భారత టీ20 జట్టుకు సారథిగా ఉంటానని చెప్పిన ఈ స్టార్‌ క్రికెటర్‌ ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ముగించాలని నిర్ణయించుకున్నాడు. నాయకుడిగా ఈ సీజనే తనకు ఆఖరిదని ఆదివారం ప్రకటించాడు. క్రికెటర్‌గా తన కెరీర్‌ ముగిసే వరకు బెంగళూరు జట్టుతో కొనసాగుతానని చెప్పాడు. ‘‘బెంగళూరు కెప్టెన్‌గా ఇదే నా ఆఖరి ఐపీఎల్‌. ఇది తేలికైన నిర్ణయం కాదు. కానీ.. ఫ్రాంఛైజీ ప్రయోజనాల దృష్ట్యా సరైందని భావిస్తున్నా. గతంలో చాలాసార్లు చెప్పినట్టుగా క్రికెటర్‌గా కెరీర్‌ ముగిసేవరకు ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుకే ఆడతాను. టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకన్నప్పటి నుంచి  ఐపీఎల్‌లోనూ సారథ్య బాధ్యతలకు దూరం కావాలని ఆలోచిస్తున్నా. ఈ విషయంపై జట్టు సభ్యులతో చర్చించాను. ఆర్‌సీబీ జట్టుకు నాయకత్వం గొప్ప, స్ఫూర్తిదాయక ప్రయాణం. ఈ అవకాశం కల్పించిన మేనేజ్‌మెంట్‌కు, నా ప్రయాణంలో భాగమైన కోచ్‌లు, ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి ధన్యవాదాలు’’ అని వీడియో సందేశంలో కోహ్లి పేర్కొన్నాడు. కోహ్లి బెంగళూరు జట్టుకు గొప్ప ఆస్తి అని, అతడి నిర్ణయాన్ని గౌరవిస్తామని ఆ ఫ్రాంఛైజీ ఛైర్మన్‌ ప్రథమేశ్‌ మిశ్రా చెప్పాడు. కోహ్లి ఐపీఎల్‌ ఆరంభం నుంచి బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు. 2013లో డానియల్‌ వెటోరి నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. అతడి కెప్టెన్సీలో 2016లో ఫైనల్‌ చేరడమే బెంగళూరుకు అత్యుత్తమ ప్రదర్శన. పని భారం తగ్గించుకోవడం కోసం టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు కోహ్లి ఇంతకుముందు తెలిపిన సంగతి తెలిసిందే. బెంగళూరు తరఫున కోహ్లి ఇప్పటివరకు 199 మ్యాచ్‌లు ఆడాడు. 5 సెంచరీలు సహా 6076 పరుగులు చేశాడు. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌ అతడి ఐపీఎల్‌ కెరీర్లో 200వ మ్యాచ్‌.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని