Priyamani- Mustafa raj : ముస్తఫా నేనూ అన్యోన్యంగా ఉన్నాం: ప్రియమణి - Telugu News i have a secure relationship with mustafa raj says priyamani on marriage controversy
close
Updated : 23/07/2021 12:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Priyamani- Mustafa raj : ముస్తఫా నేనూ అన్యోన్యంగా ఉన్నాం: ప్రియమణి

ముంబయి: వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌తో తన దాంపత్య జీవితం ఎంతో ఆనందంగా కొనసాగుతోందని నటి ప్రియమణి అన్నారు. ముస్తఫాకు తనంటే ఎంతో ఇష్టమని ఆమె పేర్కొన్నారు. ప్రియమణి-ముస్తఫారాజ్‌ల వివాహం చట్టపరంగా చెల్లదంటూ ఆయన మొదటిభార్య ఆయేషా బుధవారం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియమణి స్పందించారు.

‘ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధం మరింత బలపడాలంటే.. వాళ్లిద్దరూ పరస్పరం ప్రేమగా మాట్లాడుకోవాలి. బిజీగా ఉన్నప్పటికీ తన ప్రియమైన వారికోసం కొంతసమయాన్ని కేటాయించాలి. ముస్తఫాతో నా బంధం మరింత ధృడంగా మారడానికి కారణం కూడా అదే. మేమిద్దరం ఎంత బిజీగా ఉన్నా..  మాకంటూ సమయం కేటాయించుకుని మాట్లాడుకుంటాం. వ్యాపారపనుల నిమిత్తం ఇటీవల ముస్తఫా అమెరికా వెళ్లారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ సాయంత్రం నాకు వీడియో కాల్‌ చేసి మాట్లాడుతున్నాడు. అలాగే, నేను కూడా షూటింగ్స్‌లో ఉన్నా తన కోసం సమయం కేటాయిస్తాను. ఒకవేళ ఎప్పుడైనా ఇద్దరికీ సమయం కుదరనప్పుడు.. ఓ చిన్న మెస్సేజైనా పెట్టుకుంటాం. కాబట్టి ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా.. మా మధ్య ఉన్న అనుబంధం ఎప్పటికీ చెరిగిపోదు’ అని ప్రియమణి వ్యాఖ్యానించారు.

నటిగా రాణిస్తున్న తరుణంలోనే 2017లో ప్రముఖ వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌ని ప్రియమణి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తనకు విడాకులివ్వకుండా ప్రియమణి మెడలో ఆయన మూడు ముళ్లు వేశారంటూ ఆయేషా తాజాగా చేసిన ఆరోపణలు వైరల్‌గా మారాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని