close
బాలీవుడ్
‘థప్పడ్‌’కు పన్ను మినహాయింపు

భోపాల్‌: విడుదలకు ముందే థప్పడ్‌ చిత్రానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ స్వయంగా ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘ఇది ఒక సామాజిక సందేశం ఇచ్చే చిత్రం. సమాజంలో స్త్రీపురుషుల మధ్య ఉన్న వ్యత్యాసాలు, మహిళల హక్కులు, వారి ఆత్మగౌరవం గురించి తెలియజేసే సినిమా. అందుకే ఈ చిత్రానికి పన్ను మినహాయింపు కల్పిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. 

అప్పటి వరకూ అన్యోన్యంగా సాగుతున్న భార్యాభర్తల జీవితంలో ఓ శుభకార్యం సందర్భంగా చిన్న అపశ్రుతి చోటు చేసుకుంటుంది. ఈ కారణంతో అందరి ముందే ఆ భర్త తన భార్యను చెంపదెబ్బ కొడతాడు. అది కాస్తా విడాకుల వరకూ దారి తీస్తుంది. ప్రేమతో పాటే ఆత్మగౌరవం కూడా ముఖ్యమని భావించే ఆ భార్య తన భర్తతో కలుస్తుందా లేదా..? అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో తాప్సీ పన్ను ప్రధాన పాత్ర పోషించింది. ‘ముల్క్‌’, ‘ఆర్టికల్‌ 15’ వంటి చిత్రాల దర్శకుడు అనుభవ్‌ సిన్హా ఈ చిత్రాన్ని  తెరకెక్కించారు. రామ్‌కపూర్‌, కుముద్‌ మిశ్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జనవరి 31న విడుదలైన ట్రైలర్‌ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ట్రైలర్‌ చూసిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సైతం అభినందించారు. 
 

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.