ఇక.. రచయిత్రి కరీనా కపూర్! - To be writer Kareen Kapoor
close
Published : 20/12/2020 23:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇక.. రచయిత్రి కరీనా కపూర్!

ఇంటర్నెట్ డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఖాన్‌ రెండోసారి తల్లి కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరీనా, ఆమె భర్త సైఫ్‌ ఆలీ ఖాన్‌లకు తైమూర్‌ అనే కొడుకు ఉన్నాడు. కాగా  ఈరోజు తైమూర్‌ పుట్టినరోజు సందర్భంగా కరీనా ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. రచయిత్రిగా అవతారం ఎత్తనున్న ఆమె.. ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’ పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు.

తైమూర్‌ నాలుగో పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ సంగతిని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. అంతేకాకుండా తన పుస్తకం ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేశారు.  కాబోయే తల్లులకు సహాయకారిగా ఉండే ఈ పుస్తకంలో అవసరమైన చిట్కాలను, సమాచారాన్ని ఆమె అందచేయనున్నారు.

‘‘తల్లి కాబోయే వారందరి కోసం ఉద్దేశించిన నా పుస్తకం ‘కరీనా కపూర్‌ ఖాన్‌‘స్‌ ప్రెగ్నెన్సీ బైబిల్‌’ ను గురించి తెలియచేసేందుకు ఇది సరైన రోజు. దీనిలో గర్భవతులకు సంబంధించిన మార్నింగ్‌ సిక్‌నెస్‌ (వేవిళ్లు) , వారు తీసుకోవాల్సిన ఆహారం, ఫిట్‌నెస్‌ వంటి అన్ని విషయాల గురించి నేను తెలియచేస్తాను. ఈ పుస్తకాన్ని మీరు చదివే రోజు కోసం నేను ఎదురుచూస్తున్నాను. దీనిని జగ్గర్‌నాట్స్‌ బుక్స్‌ 2021లో ప్రచురిస్తారు.’’ అని తన ఇన్‌స్టా ఖాతాలో తెలిపారు.

‘‘గర్భధారణ సమయంలో మహిళలు చురుగ్గా, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయాన్ని ఎలా మలచుకున్నానో నా పుస్తకంలో తెలియచేస్తాను. ఆ సమయంలో మీరు ఆనందంగా ఉండేందుకు అవసరమైన సమాచారాన్నంతా అందజేస్తాను. ఈ పుస్తకం ఇతరులకు కూడా ఎంతో ఉపయోగపడగలదని ఆశిస్తున్నా’ అని కరీనా చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి..

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని