హృతిక్‌ ఇకనైనా ఏడుపు ఆపుతావా..?: కంగన - Will You Stop Crying Over A Small Affair Kangana Asks Hrithik
close
Published : 16/12/2020 00:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హృతిక్‌ ఇకనైనా ఏడుపు ఆపుతావా..?: కంగన

ముంబయి: ఈమధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. ఇటీవల రైతుల ఉద్యమం, అంతకుముందు సుశాంత్‌సింగ్‌ ఆత్మహత్య కేసుకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాలు కొని తెచ్చుకుంది. తాజాగా.. బాలీవుడ్‌ నటుడు హృతిక్‌రోషన్‌పై విరుచుకుపడింది. చిన్న వ్యవహారాన్ని గుర్తు పెట్టుకొని ఇంకా ఎన్నిరోజులు ఏడుస్తావ్‌..? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. 2013-14 మధ్య కాలంలో కంగనా ఈమెయిల్‌ నుంచి తనకు వందలాదిగా మెయిల్స్‌ వచ్చాయని హృతిక్‌ రోషన్‌ ఆరోపించాడు. అంతేకాకుండా కంగనతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. దీంతో ఇద్దరూ పరస్పర ఆరోపణలతో లీగల్‌ నోటీసులు జారీ చేశారు. అనంతరం హృతిక్‌ ముంబయి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా అతను ఆ కేసును క్రైం ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు బదిలీ చేయాలని పోలీసులను కోరాడు.

దీంతో ఈ వ్యవహారంపై కంగనా స్పందించింది. ‘‘అతని విచారకథ మళ్ళీ మొదలయింది. మేమిద్దరం విడిపోయి, అతను విడాకులు తీసుకుని చాలా సంవత్సరాలవుతోంది. కానీ.. అతను తన జీవితంలో ముందుకు వెళ్ళడం లేదు. అలాగని ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. ఈ చిన్న విషయం గురించి ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తావు’’ అంటూ కంగన ట్వీట్‌ చేసింది.

ఇదీ చదవండి..

డిలీట్‌ చేసిన ట్వీట్‌ వివాదాల్లోకి లాగింది..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని