close
అవీ.. ఇవీ..
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రీ-రిలీజ్‌, ఆడియో వేడుకలు ఉండవు: శోభూ

కొవిడ్‌ తర్వాత పరిస్థితి ఏంటి?

హైదరాబాద్‌: కరోనా సంక్షోభం వల్ల అన్ని రంగాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దీని ప్రభావం చిత్ర పరిశ్రమపై కూడా అధికంగా పడింది. షూటింగ్‌లు, సినిమాలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అనేక మంది నిర్మాతలు చాలా నష్టపోయారు. కరోనా ముగిసిన తర్వాత చిత్ర పరిశ్రమలో పరిస్థితులు, ఫిల్మ్‌ మార్కెటింగ్‌ గతంలోలా ఉండదని ప్రముఖ నిర్మాత శోభూ యార్లగడ్డ పేర్కొన్నారు. ఈ మేరకు తన అభిప్రాయాల్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘కొవిడ్‌ తర్వాత ఫిల్మ్‌ మార్కెటింగ్‌ ఎలా ఉండబోతోంది, ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెటింగ్‌ ఎలా మారుతుందో అని ఆశ్చర్యపోతున్నా. ప్రీ-రిలీజ్‌ వేడుకలు, ఆడియో విడుదల కార్యక్రమాలు, థియేటర్స్‌, మాల్స్‌కు వెళ్లడం, రోడ్‌ ట్రిప్‌లు... ఇలాంటివి ఇకపై ఉండవు. సినిమా కార్యక్రమాల్ని నిర్వహించరు. డిజిటల్‌ మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ సంభాషణలు ఎక్కువగా జరుగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు.

‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ హిట్ల తర్వాత శోభూ యార్లగడ్డ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..’ సినిమాను నిర్మించారు. సత్యదేవ్‌ కథానాయకుడు. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేం వెంకటేశ్‌ మహా దర్శకుడు. మలయాళ సినిమాకు తెలుగు రీమేక్‌ ఇది. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేశారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.