హైదరాబాద్: షూటింగ్లో ఓ ప్రమాదం నుంచి నటుడు సంపూర్ణేష్‌బాబు త్రుటిలో తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళితే సంపూర్ణేష్‌బాబు హీరోగా ‘బజారు రౌడీ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్రంలోని కొన్ని ఫైట్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే సంపూ బైక్‌తో పాటు గాల్లో ఉన్నట్టు ఒక షాట్‌ను తీస్తున్నారు. అందుకోసం బైక్‌ను తాడుతో కట్టి కిందకు వదిలే క్రమంలో అదుపుతప్పింది. దీంతో ఒక్కసారిగా ఆయన కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడికి చేరుకుని సంపూను పైకి లేపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడినట్టు సమాచారం.
ఈ చిత్రానికి వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తుండగా సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. మహేశ్వరి వద్ది కథానాయికగా ఆడిపాడుతోంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలో సందడి చేయనుంది.
ఇవీ చదవండి!
ఉపాసన షేర్ చేసిన ‘నాట్యం’ఫస్ట్‌లుక్!
స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరో, హీరోయిన్
మరిన్ని
కొత్త సినిమాలు
-
రామ్ సరసన కృతి ఖరారైంది
-
‘శ్రీకారం’.. ట్రైలర్ వచ్చేసింది
-
సందడి చేస్తోన్న ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
-
‘మహా సముద్రం’లో శర్వానంద్ ఇలా..!
-
తీసేవాడుంటే ప్రతివాడి బతుకు బయోపిక్కే..!
గుసగుసలు
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
రివ్యూ
ఇంటర్వ్యూ
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
కొత్త పాట గురూ
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని