Aadi: ‘కిరాతక’గా వస్తున్న ఆది - aadi saikumar upcoming crime thriller titled as kirathaka
close
Published : 22/06/2021 14:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Aadi: ‘కిరాతక’గా వస్తున్న ఆది

హైదరాబాద్‌: జయాపజయాలతో సంబంధం లేకుండా నటుడిగా తనని తాను నిరూపించుకునేందుకు వైవిధ్య కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు ఆది సుకుమార్‌. వీరభ్రదం దర్శకత్వంలో ఆది ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఈ సినిమాకు టైటిల్‌ను ఖరారు చేశారు. ‘కిరాత’ అనే టైటిల్‌తో రానున్న ఈ సినిమాలో కథానాయికగా అందాల ఆర్డీఎక్స్‌ పాయల్‌ రాజ్‌పూత్‌ నటించనుంది.

త్వరలోనే ‘కిరాత’ సెట్స్‌పైకి వెళ్లనుంది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా వీరభద్రం దీన్ని తీర్చిదిద్దనున్నారు. సురేశ్‌ బొబ్బలి స్వరాలు సమకూరుస్తుండగా, విజన్‌ సినిమాస్‌ పతాకంపై నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల క‌ల్యాణ్‌జీ అనే దర్శకుడితోనూ ఆది ఓ సినిమా చేస్తున్నారు. దీనితో పాటు, భాస్కర్‌ బంటుమిల్లి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని