Aadi: ‘కిరాతక’ సన్నాహాలు - aadi starer kirathaka movie shooting starts from august13
close
Published : 30/07/2021 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Aadi: ‘కిరాతక’ సన్నాహాలు

హైదరాబాద్‌: ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా ఎం.వీరభద్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం     ‘కిరాతక’. నాగం  తిరుపతి రెడ్డి నిర్మాత. పాయల్‌ రాజ్‌పూత్‌ కథానాయిక. ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ సినిమా.. ఆగస్టు 13 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ..  ‘‘మంచి క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో వస్తున్న    చిత్రమిది. ఆది, పాయల్‌ జోడీ అందరినీ అలరిస్తుంది. నటి పూర్ణ శక్తిమంతమైన పోలీస్‌ఆఫీసర్‌ పాత్రలో నటిస్తోంది. దాసరి అరుణ్‌ కుమార్, దేవ్‌గిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు’’ అన్నారు. ‘‘మేకింగ్‌ పరంగా ఎక్కడా రాజీ పడకుండా నిర్మించనున్నాం. కచ్చితంగా వాణిజ్యపరంగా మాకు మంచి విజయాన్ని అందిస్తుందని నమ్మకంగా ఉంది’’ అన్నారు నిర్మాత. సంగీతం: సురేష్‌ బొబ్బిలి, ఛాయాగ్రహణం: రామ్‌రెడ్డి.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని