close
Published : 03/03/2021 15:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్‌ 

హైదరాబాద్‌: రాజమౌళి వద్ద సహాయకుడిగా పనిచేసిన అశ్విన్‌ గంగరాజు దర్శకత్వంలో తెరుకెక్కుతున్న సరికొత్త చిత్రం ‘ఆకాశవాణి’. ఆసక్తికరమైన కథతో రూపొందుతున్న ఈ సినిమాకి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. సినిమా టీజర్‌ను దర్శకుడు రాజమౌళి మార్చి 5, సాయంత్రం 4:35 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పద్మనాభరెడ్డి ఈ సినిమాని నిర్మిస్తుండగా బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్‌ పోస్టర్లో ఓ పల్లెటూరి పిల్లవాడు ఉత్సాహంగా రేడియోను చూస్తున్న దృశ్యం వైవిధ్యంగా ఆకట్టుకునేలా ఉంది. చిత్రానికి సురేష్‌ రగుతు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, జాతీయ అవార్డ్ గ్ర‌హీత శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా పనిచేస్తున్నారు.  


ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని