క్లైమాక్స్‌ సీన్‌ కోసం ఏకధాటిగా 33 కి.మీ. పరుగు! - aayush sharma ran more than 33 km on pune streets for antim climax scene
close
Published : 25/11/2021 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్లైమాక్స్‌ సీన్‌ కోసం ఏకధాటిగా 33 కి.మీ. పరుగు!

 

ముంబయి: సినిమా సినిమాకి వైవిధ్యం చూపించాలి. అప్పుడే కదా అభిమానులకు నచ్చేది. అందుకే కొన్ని సన్నివేశాల్లో రిస్క్‌ చేసేందుకు నటీనటులు ఏమాత్రం వెనుకాడరు కూడా. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోయే సల్మాన్‌ ఖాన్‌ చిత్రం ‘అంతిమ్‌: ది ఫైనల్‌ ట్రూత్‌‌’లో అలాంటి ఓ సన్నివేశం ఉంది. ఇందులో కీలక పాత్ర పోషించిన నటుడు ఆయుష్‌ శర్మ క్లైమాక్స్‌ సీన్‌ కోసం 33 కి.మీ ఏకధాటిగా పరుగెత్తాడట. పుణెలోని వీధుల్లో ఈ సీన్స్‌ షూటింగ్‌ జరిగింది. గ్యాంగ్‌స్టర్స్‌కు, పోలీసులకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఉండనుంది. ఓ సిక్కు పోలీసు అధికారి పాత్రలో సల్మాన్‌ కనిపించారు.

60 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి..

జీ5లో వచ్చిన మరాఠీ క్రైమ్‌ డ్రామా ‘ముల్షీ’కి కొనసాగింపుగా సల్మాన్‌ఖాన్‌ సొంత బ్యానర్‌ ఎస్‌కేఎఫ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేసేశారు. సల్మాన్‌ కేవలం 30 నుంచి 35 రోజుల మాత్రమే షూటింగ్‌లో పాల్గొనడం మరో విశేషం. గత పదేళ్లలో సల్మాన్‌ సినిమా ఇంత వేగంగా తెరకెక్కడం ఇదే మొదటిసారి. హితేశ్‌ మోదక్‌, రవి బసూర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సల్మాన్‌ఖాన్‌ నిర్మిస్తున్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని