ఆచార్య: చిరు-చరణ్‌ కీలక షెడ్యూల్‌ ముగిసింది - acharya team return back to khammam
close
Published : 10/03/2021 17:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆచార్య: చిరు-చరణ్‌ కీలక షెడ్యూల్‌ ముగిసింది

హైదరాబాద్‌: చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ కథానాయిక. తాజాగా ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఖమ్మం జిల్లా సింగరేణి గనుల్లో షూటింగ్‌ చేశారు. సినిమాలో ప్రత్యేక పాత్ర చేస్తున్న రామ్‌చరణ్‌ నటించారు. తాజాగా ఈ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని చిరు తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు.

దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై పోరును కథాంశంగా తీసుకుని సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌లో చిరు మార్కు యాక్షన్‌ ఘట్టాలు కనిపించాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వేసవి కానుకగా మే 13న ‘ఆచార్య’ థియేటర్లలోకి రానుంది.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని