సినీనటుడు నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూత - actor narsing yadav passed away
close
Updated : 01/01/2021 10:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సినీనటుడు నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూత

హైదరాబాద్‌: సినీనటుడు నర్సింగ్‌ యాదవ్‌ (52) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చేరిన ఆయన.. అక్కడ చికిత్స పొందుతుండగానే గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. పలు సినిమాల్లో కామెడీ, విలన్‌ పాత్రల్లో నర్సింగ్ నటించి మెప్పించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కలిపి సుమారు 300 చిత్రాల్లో ఆయన నటించారు. నర్సింగ్‌ అసలు పేరు మైలా నరసింహ యాదవ్‌. సినీ పరిశ్రమలో అందరూ నర్సింగ్‌ యాదవ్‌ అని పిలుస్తుండేవారు.  

నర్సింగ్‌ యాదవ్‌ 1968 జనవరి 26న హైదరాబాద్‌లో జన్మించారు. ఆయనకు భార్య చిత్ర, కుమారుడు రిత్విక్‌ యాదవ్‌ ఉన్నారు. విజయ నిర్మల దర్శకత్వంలో రూపొందిన ‘హేమాహేమీలు’ చిత్రంలో నర్సింగ్ సినీరంగ ప్రవేశం చేశారు. అనంతరం నటుడిగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆయనకు బ్రేక్‌ ఇచ్చారు. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన ‘క్షణక్షణం’లో నర్సింగ్‌ నటించారు. అనంతరం మాయలోడు, అల్లరిప్రేమికుడు, ముఠామేస్త్రి, మాస్టర్‌, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఇడియట్‌, గాయం, పోకిరి, యమదొంగ, అన్నవరం, జానీ, ఠాగూర్‌, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ తదితర చిత్రాల్లో ఆయన కీలక పాత్రల్లో మెప్పించారు. గత కొంతకాలంగా నర్సింగ్‌కు డయాలసిస్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం విషమించి మృతిచెందారు.

 

ఇవీ చదవండి..

రజనీ అభిమానులకు మోహన్‌బాబు విన్నపం

‘క్రాక్‌’కి నారప్ప వాయిస్‌ ఓవర్‌

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని