నాకిది సెకండ్‌ ఇన్నింగ్స్‌ కాదు: రాశి
close
Published : 29/06/2020 09:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాకిది సెకండ్‌ ఇన్నింగ్స్‌ కాదు: రాశి

‘‘విభిన్న పాత్రలతో మెప్పించడమంటే నాకెంతో ఇష్టం. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు పోషిస్తుంటే నాకే కాదు, చూసే వాళ్లకూ బోర్‌గానే ఉంటుంది. అందుకే ఒకసారి చేసిన పాత్రను మళ్లీ చేయకూడదనుకుంటా’’ అంటోంది సీనియర్‌ కథానాయిక రాశి. ‘మమతల కోవెల’ చిత్రంతో బాలనటిగా తెలుగు తెరపై అడుగుపెట్టి.. ‘గోకులంలో సీత’, ‘అమ్మో, ఒకటో తారీఖు’, ‘పెళ్లి పందిరి’, ‘ప్రేయసి రావే’ ‘మనసిచ్చి చూడు’, ‘దేవుళ్లు’ వంటి పలు హిట్‌ చిత్రాలతో తెలుగు తెరపై అగ్ర కథానాయికగా మెరిసింది.

‘నిజం’తో ప్రతినాయికగానూ శభాష్‌ అనిపించుకుంది. కొంత కాలంగా వైవిధ్యభరిత పాత్రలతో తన సినీప్రయాణాన్ని కొనసాగిస్తోంది. సోమవారం ఆమె జన్మదినం. ఈ సందర్భంగా ఆదివారం ‘ఈనాడు సినిమా’తో తన వ్యక్తిగత, సినీ విశేషాలు పంచుకుంది రాశి.

* ‘‘నటిగా ఇన్నేళ్ల సినీ ప్రయాణాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే  సంతృప్తిగా అనిపిస్తోంది. ఎన్నో మంచి పాత్రలు చేశా.

* అందరూ నేను సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టా అంటుంటారు. నిజానికి నేనెప్పుడూ నా సినీ ప్రయాణాన్ని ఆపలేదు. పరిస్థితుల్ని బట్టీ కాస్త తగ్గించానంతే.

* పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితంతో బిజీ అయ్యా. నాకెక్కువ ఇంట్లో గడపడమంటేనే ఇష్టం. అందుకే నాకీ లాక్‌డౌన్‌ పరిస్థితులు పెద్ద కష్టంగా అనిపించలేదు. కానీ, ఈ కరోనా పరిస్థితుల్ని చూస్తుంటే మనసుకు బాధగా అనిపిస్తుంటుంది.

* నేనొక యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించా. కాలక్షేపానికి వంటలు, అవీ ఇవీ కొన్ని వీడియోలు దాంట్లో పోస్ట్‌ చేస్తుంటా.

* ఇక మా పాప రితిమా అల్లరితో మరింత కాలక్షేపం దొరుకుతుంది. ఇప్పుడు తను ఫస్ట్‌ గ్రేడ్‌. 

* మంచి కథ, మనసుకు నచ్చిన పాత్ర ఉన్న చిత్రాల్నే చేస్తున్నా. తెలుగులో రెండు పెద్ద సినిమాలు చేస్తా. త్వరలోనే వాటిపై అధికారిక ప్రకటన వస్తుంది. ప్రస్తుతం తమిళ్‌, తెలుగులో రెండు చిత్రాలు చేస్తున్నా. దీంతో పాటు మా భర్త శ్రీముని దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్‌ చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు రాశి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని