Adah Sharma: ‘మీట్ క్యూట్‌’లో ఒక‌రిగా అదా  - adah sharma to play one of the leading lady in nani next production meet cute
close
Published : 18/06/2021 18:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Adah Sharma: ‘మీట్ క్యూట్‌’లో ఒక‌రిగా అదా 

ఇంట‌ర్నెట్ డెస్క్‌: న‌టుడిగా మాత్ర‌మే కాదు నిర్మాత‌గానూ ప్రేక్ష‌కుల‌కి వైవిధ్య క‌థ‌ల్ని ప‌రిచ‌యం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు నాని. వాల్ పోస్ట‌ర్ సినిమా ప‌తాకంపై ఆయ‌న నిర్మించిన ‘అ!’, ‘హిట్’ చిత్రాలు ఈ కోవ‌లోకే వ‌స్తాయి. ప్ర‌స్తుతం ఇదే బ్యాన‌ర్‌పై మ‌రో రెండు సినిమాలు రాబోతున్నాయి. అవే ‘హిట్ 2’, ‘మీట్ క్యూట్‌’. నాని సోద‌రి దీప్తి ఘంటా దర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోంది ‘మీట్ క్యూట్‌’. ఇందులో ఐదుగురు నాయిక‌ల‌కి చోటుంది. ఓ పాత్ర‌కి యువ న‌టి అదాశ‌ర్మ ఎంపికైంది. ఈ సంద‌ర్భంగా త‌న మ‌న‌సులో మాట పంచుకుంది.

‘‘ఇప్ప‌టి వ‌ర‌కు నేను న‌టించ‌ని పాత్ర‌ని ఈ సినిమాలో పోషిస్తున్నాను. పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీ నేప‌థ్యంలో నేను న‌టిస్తోన్న తొలి తెలుగు చిత్ర‌మిది. సరికొత్త క‌థ‌ల్ని, విభిన్న నేప‌థ్యాల్ని ప్రేక్ష‌కుల‌కి అందించేందుకు తెలుగు సినిమా ప‌రిధుల్ని చెరిపేస్తుంటారు నాని. ప్ర‌యోగాలు చేసేందుకు ఎప్పుడూ ముందుంటారాయ‌న‌. అలాంటి ఆయ‌న ప్రాజెక్టులో ఓ భాగ‌మ‌వ‌డం చాలా ఆనందంగా ఉంది. దీప్తి విష‌యానికొస్తే ప్ర‌తి స‌న్నివేశాన్ని క్లుప్తంగా వివ‌రిస్తుంది. ఈ ప్రాసెస్‌ని నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను. జూమ్ వేదిక‌గా మేము పాత్ర‌కి సంబంధించిన రిహార్స‌ల్స్ చేస్తున్నాం. వ‌ర్చువ‌ల్ విధానంలో ఒక‌రికొక‌రం అందుబాటులో ఉంటున్నాం. త్వ‌ర‌లోనే ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డి, షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని భావిస్తున్నా’’ అని తెలిపింది అదా. ఈ సినిమాలోని మిగతా పాత్రల కోసం నివేదా థామస్, రుహానీ శర్మ, కాజ‌ల్ తదితర భామ‌ల‌ పేర్లు వినిపిస్తున్నాయి. స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని