close
Published : 12/04/2021 16:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కన్నీటితో ఎదురుచూస్తున్న అదితి 

ఇంటర్నెట్‌ డెస్క్: ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్ర  దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. శర్వానంద్‌, సిద్ధార్థ్ కథానాయకులుగా నటిస్తుండగా అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ నాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి అదితిరావు హైదరీ పాత్రను ‘మహ’గా పరిచయం చేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్ని విడుదల చేసింది. పోస్టర్లో అదితిరావు కన్నీటి చెమ్మతో దేనికోసమో ఎదురుచూస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు అజయ్‌ ట్వీటర్‌ వేదికగా స్పందిస్తూ..‘‘మనోహరమైన అందాలతార అదితిరావు ఇందులో ‘మహ’గా నటిస్తోంది. మా ‘మహాసముద్రం’ చిత్రానికి ఆత్మ వంటిది’’అంటూ పేర్కొన్నారు. శర్వానంద్‌ సరసన అదితి నటించనుందని సమాచారం. యాక్షన్‌ ప్రేమకథా నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. చిత్రంలో జగపతిబాబు చుంచుమామగా కీలక పాత్రలో నటిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీత స్వరాలు సమకూరుస్తుండగా తోట రాజా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


1381454484425990145

ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని