AdiviSesh: ఉదారత చాటుకున్న శేష్‌ - adivi sesh installed a water purification system
close
Published : 05/05/2021 14:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AdiviSesh: ఉదారత చాటుకున్న శేష్‌

హైదరాబాద్‌: కొవిడ్‌ బాధితులకు సహాయం చేస్తూ తన ఉదారత చాటుకున్నారు యువ నటుడు అడివి శేష్‌. ప్రస్తుతం కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో 300లకి పైగా కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. అక్కడ తాగు నీటి కొరత ఉందని తెలుసుకున్న శేష్‌.. 865 లీటర్ల వాటర్‌ బాటిళ్లను ఆ ఆసుపత్రికి పంపించారు. అక్కడితో ఆగిపోకుండా నీటి కొరతకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు తనవంతు కృషి చేశారు. ఆస్పత్రి సిబ్బంది సహా ఎవరూ తాగు నీటికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు నీటి శుద్ధీకరణ యంత్రాన్ని ఏర్పాటు చేయించారు. ఇది గంటకు 1000 లీటర్ల నీటిని అందిస్తుంది.

ఎప్పటి నుంచో ఉన్న సమస్యని తీర్చడంతో రోగులు, వైద్యులు, ఇతర సిబ్బంది నటుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘సెలబ్రిటీలు ఏదైనా సమస్యకి పాక్షికంగా పరిష్కారం చూపడం సహజం.. కానీ శాశ్వత పరిష్కారం చూపడం అసాధరణం’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘మేజర్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు అడవి శేష్‌. మేజర్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా శశి కిరణ్‌ తిక్క తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని