ఈసారైనా సవ్యంగా సాగేనా?
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించనున్న ‘లూసిఫర్’ రీమేక్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఓ స్టార్ హీరోయిన్ మెగాస్టార్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్?
చిరంజీవి నటించిన ‘స్టాలిన్’లో కథానాయికగా ప్రేక్షకులను అలరించారు నటి త్రిష. 2006లో విడుదలైన ఈ సినిమా విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ పంచుకోలేదు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’లో మొదట త్రిషనే కథానాయికగా అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగారు. కాగా, ‘లూసిఫర్’ రీమేక్‌లో నయనతారను కథానాయికగా అనుకున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నయన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని.. దీంతో, ఆమె స్థానంలో త్రిషను ఎంపిక చేసుకున్నారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్రిష కూడా ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
టీజర్‌తోనే అదరగొట్టిన ‘టక్ జగదీష్’
-
‘తెల్లవారితే గురువారం’.. వినూత్న ప్రచారం
- ఎవరూ ఊహించని సస్పెన్స్ ‘క్షణక్షణం’లో ఉంటుంది
-
‘రంగ్ దే’.. గుమ్మడికాయ కొట్టేశారు
- ‘పీఎస్పీకే 27’.. ఫస్ట్‌లుక్, టైటిల్ ఆరోజే
గుసగుసలు
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- ఎన్టీఆర్‌ను ఢీకొట్టనున్న మక్కళ్ సెల్వన్..!
- శంకర్-చరణ్ మూవీ: ఆ షరతులు పెట్టారా?
- ఆ ఇద్దరిలో ‘దళపతి 66’ దర్శకుడెవరు?
- RRR: ఆలియాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు.!
రివ్యూ
ఇంటర్వ్యూ
-
నా బ్రెయిన్లో 9 టైటానియం తీగలున్నాయి!
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘నాలో ఆర్ట్‌ని గుర్తించింది పవన్ కల్యాణే’
- నా నటనతో... ఆ పేరు మార్చేసుకుంటా!
- అందరి జీవితాలకు అన్వయించుకోవచ్చు
కొత్త పాట గురూ
-
ఇదీ.. జాతి రత్నాల కథ
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
‘చెక్’మేట్‌తో ఒక డ్యూయెట్!
-
ఫిఫిఫీ..ఫిఫీ..అంటున్న గాలిసంపత్!