Viral video: అటు పతకం గెల్చి.. ఇటు ప్రేమను పొంది.. - airport proposal for canadian athlete
close
Published : 05/08/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Viral video: అటు పతకం గెల్చి.. ఇటు ప్రేమను పొంది..

డైవింగ్‌లో రజతం గెల్చిన కెనడా క్రీడాకారిణికి అపురూప అనుభవం

ఒట్టావా: టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించి తిరిగి వచ్చిన ఏ క్రీడాకారిణికి ఇంతకు మించిన ఆహ్వానం లభించి ఉండకపోవచ్చు! కెనడాకు చెందిన ఓ డైవర్‌ అలా ఊహించని అనుభవం ఎదుర్కొంది. స్వదేశానికి చేరుకున్న వెంటనే ఎయిర్‌పోర్ట్‌లో తన స్నేహితుడి నుంచి రొమాంటిక్ ప్రపోజల్‌ను అందుకుంది. 

జెన్నిఫర్ అబెల్ టోక్యో ఒలింపిక్స్‌లో డైవింగ్‌లో రజత పతకాన్ని సాధించింది. తన సహచరులతో కలసి సోమవారం స్వదేశం కెనడాకు చేరుకుంది. విమానాశ్రయంలో ఆమెకు ఆహ్వానం పలికిన ఆమె స్నేహితుడు.. ఇదే మంచి సందర్భంగా భావించి తన ఇష్టసఖికి ప్రేమను వెల్లడించాడు. మోకాళ్లపై వంగి, డైమండ్ రింగ్‌ను తొడిగి రొమాంటిక్‌గా తన ప్రేమను వ్యక్తపరిచాడు. దాంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన జెన్నిఫర్.. ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో తన ప్రేమను అంగీకరించింది. మొదట ఈ వీడియో టీమ్ కెనడా ఖాతాలో షేర్ కాగా, దాన్ని ఒలింపిక్స్ ట్విటర్ ఖాతా రీట్వీట్ చేసింది. ‘ఒలింపిక్ పతకం నుంచి డైమండ్ రింగ్ వరకు.. జెన్నిఫర్ వేడుక జరుపుకోవడానికి చాలా విషయాలున్నాయి’ అంటూ టీమ్ కెనడా రాసుకొచ్చింది. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని