Cinema News: ఆకాశ్‌ పూరీ కొత్త సినిమా టైటిల్‌ ఇదే..! - akash puri new movie motion poster released
close
Published : 25/07/2021 13:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ఆకాశ్‌ పూరీ కొత్త సినిమా టైటిల్‌ ఇదే..!

హైదరాబాద్‌: పూరీ జగన్నాథ్‌ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యువ నటుడు ఆకాశ్‌ పూరీ. ఆయన కథానాయకుడిగా ఓ సరికొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘చోర్‌బజార్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఆదివారం ఆకాశ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సినిమా మోషన్‌పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో ఆకాశ్‌ మాస్‌లుక్‌లో కనిపించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది.

పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించిన ఆకాశ్‌పూరీ ‘గబ్బర్‌సింగ్‌’, ‘ధోనీ 2021’లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ఆకాశ్‌ ‘ఆంధ్రాపోరి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా అనుకున్నంతస్థాయి విజయాన్ని అందించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘మెహబూబా’ మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన ‘రొమాంటిక్‌’, ‘చోర్‌ బజార్‌’ సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నారు.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని