Akhanda: బాల‌కృష్ణ బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది   - akhanda realeased new poster
close
Published : 09/06/2021 17:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Akhanda: బాల‌కృష్ణ బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది 

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ప్ర‌ముఖ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు (జూన్ 10) సంద‌ర్భంగా అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ అందించింది ‘అఖండ’ చిత్ర బృందం. బాల‌కృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెర‌కెక్కిస్తోన్న‌ చిత్రమిది. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా బాల‌కృష్ణ‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఇందులో క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని చిరునవ్వు చిందిస్తూ క‌నిపించారు బాల‌కృష్ణ‌.  విడుద‌లైన కొన్ని క్ష‌ణాల్లోనే సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది ఈ ఫొటో. ఈ చిత్రంలో బాల‌కృష్ణ స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్ న‌టిస్తోంది. శ్రీకాంత్, జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ద్వార‌క క్రియేష‌న్స్ ప‌తాకంపై ర‌వీంద‌ర్ రెడ్డి మిర్యాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బోయ‌పాటి శ్రీను- బాల‌కృష్ణ కల‌యిక‌లో వ‌చ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు ఘ‌న విజ‌యం అందుకోవ‌డంతో ‘అఖండ‌’పై భారీ అంచ‌నాలు న‌మోద‌వుతున్నాయి.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని