కొరటాల దర్శకత్వంలో  అఖిల్ అక్కినేని? - akhil act in koratala direction
close
Published : 16/05/2021 00:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొరటాల దర్శకత్వంలో  అఖిల్ అక్కినేని?

ఇంటర్నెట్‌ డెస్క్: కొరటాల శివ దర్శకత్వంలో  చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా అక్కినేని అఖిల్‌ హీరోగా ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి. ఇప్పటికే నాగార్జున, కొరటాలను సంప్రదించాడని టాక్‌ వినిపిస్తోంది. అఖిల్ ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించి టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. అఖిల్‌ - పూజా హెగ్డేతో కలిసి నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.  ఇక కొరటాల -  ఎన్టీఆర్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ విధంగా చూస్తే  అఖిల్‌ - శివల సినిమా ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే!   



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని