close
Published : 21/02/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సిలకాసిలకా అందాల మొలక.. పాట విన్నారా.!

హైదరాబాద్‌: నందితాశ్వేత ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘అక్షర’. చిన్నికృష్ణ దర్శకత్వం వహించారు. సురేశ్‌వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 26 విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలోని ‘సిలకాసిలకా’ పాటను యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వక్‌ మాట్లాడుతూ.. పాట చాలా బాగుంది. చిన్న సినిమాలకు కాసుల వర్షం కురుస్తోంది. అక్షర సినిమాకు కూడా బాగా కలెక్షన్లు రావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. దర్శకుడు చిన్ని కృష్ణ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థ లోపాలను చూపిస్తూ అక్షర సినిమా రూపొందించామని, ప్రేక్షకులకు ‘అక్షర’ మంచి అనుభూతి ఇస్తుందన్నారు. నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ.. చిన్న సినిమాగా అక్షరను మొదలుపెట్టాం. అందరి సహకారంతో పెద్ద సినిమాగా రిలీజ్ చేస్తున్నామన్నారు. హీరోయిన్ నందిత శ్వేతా మాట్లాడుతూ.. అక్షర సినిమా ఒక మంచి సినిమా. థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు మంచి ఫీల్‌తో వస్తారని చెప్పింది. ఈ కార్యక్రమంలో నటుడు మధు నందన్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఈ ఈ చిత్రంలో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని