Akshara Singh: నటిపై యాసిడ్‌ దాడికి యత్నించిన మాజీ ప్రియుడు - akshara singh says her ex hired boys to throw acid on her
close
Published : 14/09/2021 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Akshara Singh: నటిపై యాసిడ్‌ దాడికి యత్నించిన మాజీ ప్రియుడు

ముంబయి: తాను ఎంతగానో అభిమానించిన ఓ వ్యక్తి తనని చంపేయాలనుకున్నాడని నటి అక్షర సింగ్‌ తెలిపారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటిగా కెరీర్‌ ఆరంభించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులను ఒప్పించి ముంబయికి వచ్చానని చెప్పారు. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె వెల్లడించారు. తాను జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఏ అమ్మాయికీ రాకూడదని ఆమె కోరుకున్నారు. ‘నటిగా రాణించడం కోసం ఇండస్ట్రీలోకి అడుగుపెడతానంటే మా కుటుంబంలో ఒప్పుకోరు. అలాంటి సాంప్రదాయ కుటుంబం నుంచి నేను పరిశ్రమలోకి వచ్చాను. కెరీర్‌ ప్రారంభించిన కొత్తలో నాకు ఆఫర్స్‌ వచ్చేవి కాదు. ఒకవేళ ఆఫర్స్ వచ్చినా సరే కారణం లేకుండానే అవి చేజారిపోయేవి. నా వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. అనుకోని కారణాల వల్ల ఓ వ్యక్తితో నాకు బ్రేకప్‌ జరిగింది. ఆ తర్వాత అతను నన్ను చంపేస్తానంటూ బెదిరించాడు. మనుషుల్ని పెట్టించి నాపై యాసిడ్‌ దాడి చేయాలనుకున్నాడు. ఆరోజు నేను అనుభవించిన బాధను మాటల్లో వివరించలేను. మానసిక క్షోభకు గురయ్యాను. ఆ సమయంలో నాన్న నాకెంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యంతోనే ఇప్పుడు కెరీర్‌లో రాణిస్తున్నా’ అని అక్షర పేర్కొన్నారు.

హిందీలో తెరకెక్కిన ‘సత్యమేవ్‌ జయతే’, ‘సథియా’, ‘ధడ్కన్‌’, ‘మాతుజే సలామ్‌’ వంటి చిత్రాల్లో నటించిన అక్షర మెప్పించారు. ఇటీవల ఆమె ‘బిగ్‌బాస్‌ ఓటీటీ’ వేదికగా ప్రేక్షకుల్ని అలరించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని