close
Published : 02/03/2021 19:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హిందీ ‘ఆర్‌ఎక్స్‌ 100’ విడుదల ఎప్పుడంటే?

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి తనయుడు అహాన్‌ శెట్టి కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘తడాప్‌’. మిలాన్‌ లుథ్రియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్‌ స్టూడియోస్‌ సమర్పణలో నదియాద్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాని సెప్టెంబర్‌ 24న విడుదల చేస్తున్నట్లు పోస్టర్లను విడుదల చేసింది చిత్రబృందం. సినిమా పోస్టర్‌పై పలువురు బాలీవుడ్‌ సీనియర్‌ హీరోలు స్పందించారు.

నటుడు అక్షయ్‌ కుమార్‌ స్పందిస్తూ...‘‘ఈరోజు నీకు చాలా గొప్పరోజు. మీ నాన్న సునీల్ శెట్టి నటించిన తొలి చిత్రం ‘బాల్వాన్‌’ పోస్టర్‌ నాకు గుర్తుకొస్తోంది. ఈరోజు నీ పోస్టర్‌ షేర్‌ చేస్తుంటే చాలా గర్వంగా ఉందని’’ ట్విటర్‌లో పేర్కొన్నారు. మరో హీరో అజయ్‌ దేవగణ్‌ ట్వీటర్‌లో స్పందిస్తూ...‘‘ఇది భావోద్వేగ సమయం. అహాన్ ఇంత త్వరగా పెద్దవాడయ్యాడు. నీ మొదటి చిత్రం ‘తడాప్‌’ దర్శకుడు మిలాన్‌ లుథ్రియా చేతిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని’’ అంటూ తెలిపారు.

నటుడు రితేష్‌ పోస్టర్‌ని ఉద్దేశించి స్పందిస్తూ...‘‘ఇదొక అద్భుతమైన పోస్టర్‌. అహాన్‌ శెట్టి, తారా సుతారియాల కాంబినేషన్‌ చూస్తుంటే సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయని’ అని అన్నారు. ‘తడాప్’  సినిమా షూటింగ్ 2019 ఆగస్టులో ముంబైలోని సెంట్రల్ ప్లాజా అనే థియేటర్‌లో ప్రారంభమైంది. కరోనా కారణంగా అన్ని సినిమాల్లాగే ఈ చిత్రం కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ‘తడాప్‌’ తెలుగులో వచ్చిన ‘ఆర్ఎక్స్100’ చిత్రానికి రీమేక్‌. అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ కథానాయకుడిగా నటించగా, పాయల్‌ రాజ్‌పుత్‌ నాయికగా నటించింది.   



1366636891144126465

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని