వెనక్కి తగ్గిన ‘తాండవ్’
మార్పులు చేస్తున్నట్లు ప్రకటన
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రధానపాత్రలో నటించిన ‘తాండవ్’ మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్న ఆరోపణలతో వివాదంలో ఇరుక్కుంది. ఓటీటీలో ప్రసారమవుతున్న ఈ వెబ్‌సిరీస్‌ను నిలిపివేయాలంటూ నిరసనలు వెల్లువెత్తడంతో పాటు దర్శకనిర్మాతలు, నటులపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వెబ్‌సిరీస్ వల్ల మనోభావాలు దెబ్బతిన్నవాళ్లకు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ క్షమాపణలు చెప్పి వెనక్కి తగ్గారు. అంతేకాదు.. తాజాగా ఆ వెబ్‌సిరీస్‌లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు.
పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ‘తాండవ్’ జనవరి 15న డిజిటల్ ప్లాట్‌ఫాంపై విడుదలైంది. ఈ వెబ్‌సిరీస్‌లో తమ మతాన్ని కించపరిచేలా కొన్ని సన్నివేశాలున్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇంటర్నెట్లో బాయ్‌కాట్ తాండవ్.. బ్యాన్‌తాండవ్ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేసి నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్రమంత్రి, భాజపా ఎంపీ, యూపీ భాజపా ఎమ్మెల్యేలు కొందరు‘తాండవ్’పై ఫిర్యాదులు చేయడంతో యూనిట్ సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో దర్శకుడు అలీ వెబ్‌సిరీస్‌లో మార్పులు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
‘‘మన దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తాం. ఏ ఒక్క వ్యక్తి, కులం, మతం, జాతి లేదా మత విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీయడం లేదా కించపరచడం మా ఉద్దేశం కాదు. ఏదైనా సంస్థ, రాజకీయ పార్టీని అవమానించాలన్న ఆలోచన కూడా మాకు లేదు. ‘తాండవ్’లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంలో మాకు మద్దతు ఇచ్చినందుకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ధన్యవాదాలు. ఈ సిరీస్ ఎవరి మనోభావాలను దెబ్బతీసి ఉంటే మేము మరోసారి క్షమాపణలు కోరుతున్నాం” అని అబ్బాస్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
వీడియో లీక్.. రూ.25 కోట్లు డిమాండ్
పెళ్లి ప్లాన్స్ బయటపెట్టిన తాప్సీ
మరిన్ని
కొత్త సినిమాలు
- రామ్.. దేవిశ్రీ ఏడోసారి
-
‘విక్రాంత్ రోణ’ విడుదల తేదీ ఖరారైంది
-
‘విరాట పర్వం’ విడుదల వాయిదా
- ‘అశోకవనంలో....’ విశ్వక్సేన్
-
ఆకట్టుకునేలా ‘సెహరి’ టీజర్
గుసగుసలు
- ‘ఆర్సి 15’లో జర్నలిస్టుగా రష్మిక?
- తదుపరి చిత్రం ఎవరితో?
-
కొరటాల చిత్రంలో కొత్తగా కనిపించనున్న ఎన్టీఆర్!
- ‘దోస్తానా 2’లో కార్తిక్ ఆర్యన్ నటించడం లేదా?
- వెంకటేష్, వరుణ్‌తేజ్ చిత్రంలో అంజలి!
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
కొత్త పాట గురూ
-
‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
-
జాతి రత్నాలు: ‘సిల్లీ ఫూల్స్’ని చూశారా!
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్