అలీ మూవీ పాటని విడుదల చేసిన సోనూసూద్‌ - ali film andaru bagundali andulo nenundali title track launched by sonusood
close
Published : 10/07/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలీ మూవీ పాటని విడుదల చేసిన సోనూసూద్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: అలీ, నరేశ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’. ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అనేది ఉపశీర్షిక. శ్రీపురం కిరణ్‌ దర్శకుడు. ఆలీబాబా, కొణతాల మోహన్‌, శ్రీచరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టైటిల్‌ ట్రాక్‌ని సోనూసూద్‌ శుక్రవారం విడుదల చేసి, అలీకి శుభాకాంక్షలు తెలిపారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ గీతానికి రాకేశ్‌ స్వరాలు సమకూర్చారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఈ సినిమాలో శివ బాలాజీ, పవిత్ర లోకేశ్‌, మౌర్యానీ, సనా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వీడియోలో కొన్ని సన్నివేశాల్లో కనిపించి ఆకట్టుకున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘వికృతి’కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని