close
Published : 21/02/2021 17:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘ఏఏ 21’.. రంగం సిద్ధమవుతోంది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌- కొరటాల శివ కలయికలో ఓ చిత్రం తెరకెక్కునున్న సంగతి తెలిసిందే.  ‘ఏ ఏ 21’ వర్కింగ్‌ టైటిల్‌తో గతేడాది ప్రకటించారు. గీతా ఆర్ట్స్‌ 2 పిక్చర్స్‌ సంస్థ సహకారంతో యువసుధ ఆర్ట్స్‌ పతాకంపై సుధాకర్‌ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మొదలయ్యాయని, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని తాజా సమాచారం.

ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నారు బన్ని. ఆగస్టు 13న విడుదలకానుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే కొరటాల చిత్రం సెట్‌లో అడుగుపెట్టనున్నారట. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడుగా ‘ఆచార్య’ తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. కాజల్‌ నాయిక. రామ్‌ చరణ్‌ సిద్ధ అనే పాత్రలో మెరవనున్నారు. దేవదాయ శాఖ నేపథ్యంలో రాబోతుంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని