పుష్ప షూట్‌.. బన్నీ ఎమోషనల్‌..! - allu arjun misses his daughter allu arha
close
Updated : 31/01/2021 11:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుష్ప షూట్‌.. బన్నీ ఎమోషనల్‌..!

నెటిజన్ల మది దోచేస్తోన్న వీడియో

హైదరాబాద్‌: స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు తన గారాలపట్టి అర్హ అంటే ఎంతిష్టమో మాటల్లో చెప్పలేం. అర్హ చేసే ప్రతి చిన్న అల్లరి పనిని బన్నీ పూర్తిగా ఆస్వాదిస్తుంటారు. అర్హ.. ముద్దులొలికే మాటల్ని వీడియోలుగా చిత్రీకరించి తరచూ ఇన్‌స్టాలో షేర్‌ చేసి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటారు. అయితే, ప్రస్తుతం బన్నీ.. అర్హను ఎంతో మిస్‌ అవుతున్నారు.

‘పుష్ప’ షూట్‌ కోసం బన్నీ, ఇతర చిత్రబృందం కేరళకు పయనమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన అర్హను మిస్‌ అవుతున్నానని పేర్కొంటూ ఇన్‌స్టా వేదికగా ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. ఇందులో ‘బెండకాయ, దొండకాయ, నువ్వు నా గుండెకాయ’అంటూ బన్నీతో అర్హ ముద్దుముద్దుగా చెప్పడంతో ఆయన చిరునవ్వులు చిందిస్తారు. ఈ వీడియోని షేర్‌ చేసిన బన్నీ.. ‘ఐ మిస్‌ యూ అర్హ’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబోలో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. దీనిలో రష్మిక కథానాయిక. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 13న విడుదల కానుంది.

ఇదీ చదవండి

సెట్‌లో సేఫ్‌గా అనిపించలేదు: ప్రియాంక
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని