Amala Paul: ఉత్కంఠగా ‘కుడి ఎడమైతే’ ట్రైలర్‌ - amala paul kudi yedamaithe trailer released
close
Published : 14/07/2021 21:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Amala Paul: ఉత్కంఠగా ‘కుడి ఎడమైతే’ ట్రైలర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మీకు ఎప్పుడైనా లైఫ్‌లో జరిగిందే మళ్లీ మళ్లీ జరిగినట్టు అనిపించిందా’ అంటూ ఉత్కంఠ పెంచుతోంది నటి అమలాపాల్‌. ఆమె నటించిన వెబ్‌ సిరీస్‌ ‘కుడి ఎడమైతే’ జులై 16 నుంచి ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్‌ విడుదలైంది. పలు ట్విస్ట్‌లతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. డెలివరీ బాయ్‌ (రాహుల్‌ విజయ్‌), పోలీసు అధికారిణి (అమలా పాల్‌).. ఇద్దరికీ జరిగిందే మళ్లీ మళ్లీ జరిగినట్టు అనిపిస్తుంది. అది వాళ్లకి తప్ప ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంటుంది. దానికి కారణం నువ్వంటే నువ్వు అనుకుంటూ వాగ్వాదానికి దిగుతారు. అసలు ఆ ప్రమాదం ఏంటి? దానికి బాధ్యులు ఎవరు? అంటే సిరీస్‌ చూడాల్సిందే. మధ్యలో ఓ కిడ్నాప్‌ కేసుని ఛేదించేందుకు అమలా వేసే ప్లాన్లు, ముగింపులో ‘టైం ఎవరి కోసం ఆగదు.. లైఫ్‌ ఎప్పుడూ సెకండ్‌ ఛాన్స్‌ ఇవ్వదు’ అనే డైలాగ్‌ ఆకట్టుకుంటున్నాయి. క్రైమ్‌ సస్పెన్స్‌ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌కి పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. గతంలో ‘యూ టర్న్‌’, ‘లూసియా’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు తెరకెక్కించారాయన. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించారు. పూర్ణ చంద్ర తేజస్వి ఎస్‌.వి. సంగీతం అందించారు. ఎనిమిది భాగాలుగా (ఎపిసోడ్లు) ఈ సిరీస్‌ విడుదల కానుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని