‘వకీల్‌సాబ్’ నుంచి మరో ఫొటో లీక్‌
close
Published : 29/06/2020 12:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వకీల్‌సాబ్’ నుంచి మరో ఫొటో లీక్‌

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కావాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లకు సంబంధించి ఆంక్షలు సడలించడంతో మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇందుకు తగినట్లు ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ఓ సన్నివేశానికి సంబంధించిన ఒక ఫొటో సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. పవన్‌ ఇందులో లాయర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆయన కోర్టులో నల్లకోటు ధరించి వాదనలు వినిపిస్తున్న సన్నివేశానికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో నటి అంజలి కూడా ఉండటం విశేషం. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌, పవన్‌ లుక్‌ మినహా మిగిలిన పాత్రలను పరిచయం చేయలేదు. తాజాగా ఫొటో లీక్‌తో ఇందులో అంజలి నటిస్తున్నారని అర్థమవుతోంది.

మరి లాయర్‌గా పవన్‌ తన వాగ్ధాటితో వెండితెరపై ఎలా మెప్పిస్తారో చూడాలి. రాజకీయాలతో బిజీగా ఉన్న ఆయన చాలా రోజుల విరామం తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అన్నట్లు ‘వకీల్‌సాబ్’ టైటిల్‌లో కనిపించే పవన్‌ ఐకాన్‌ కూడా మొదటిసారి లీకైన ఫొటో ఆధారంగా తీర్చిదిద్దినదే కావడం గమనార్హం.

అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ కీలక పాత్రల్లో బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం ‘పింక్‌’. 2016లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా తమిళంలో ‘నేర్కొండ పార్వాయ్‌’గా రీమేక్‌ చేశారు. అజిత్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పుడు తెలుగులో ‘వకీల్‌సాబ్‌’గా వస్తోంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని