Cinema News: ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ ప్రముఖుల భేటీ - ap minister nani meets producers and distributors
close
Updated : 20/09/2021 14:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ ప్రముఖుల భేటీ

హైదరాబాద్‌: ఏపీ మంత్రి పేర్ని నానితో ఇవాళ ఉదయం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు భేటీ అయ్యారు. ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, సి.కల్యాణ్‌, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు పాల్గొన్నారు. ఆన్‌లైన్‌ టిక్కెట్ల వ్యవహారంపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, తెలుగు చిత్రపరిశ్రమను ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ ఆదివారం సాయంత్రం ఓ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో చిరంజీవి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను కనికరించాలని.. తమ అభ్యర్థనను మన్నించాలని చిరు కోరిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని