close
గుస‌గుస‌లు
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అఘోరా కోసం రెండు గెటప్పులు

హైదరాబాద్‌: బాలకృష్ణ తెరపై ఎలా కనిపిస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో దర్శకుడు బోయపాటి శ్రీనుకి బాగా తెలుసు. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల్లో ఆయన్ని విభిన్నమైన గెటప్పుల్లో చూపించారు. ఆ ప్రయత్నం  అభిమానులకి ఎంత బాగా నచ్చిందో, సగటు ప్రేక్షకుడికీ అంతే నచ్చింది. బాలకృష్ణ - బోయపాటి కలయికలో సినిమా అంటే చాలా అంచనాలుంటాయి. వీరిద్దరిదీ విజయవంతమైన కలయిక. ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత ముచ్చటగా మూడోసారి కలిసి సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు బోయపాటి. గెటప్పుల  విషయంలో కసరత్తులు మరింత పక్కాగా  జరుగుతున్నాయి.

ఇందులో బాలకృష్ణ రెండు కోణాల్లో కనిపిస్తారు. ఒక పాత్రలో అఘోరాగా సందడి చేస్తారు. ఆ పాత్ర కోసం రెండు రకాల గెటప్పులు సిద్ధమైనట్టు సమాచారం. లాక్‌డౌన్‌ తర్వాత ఆ గెటప్పులతో మేకప్‌ టెస్ట్‌లు జరగబోతున్నాయట. అందులో ఒక గెటప్పుని ఖాయం చేసి, సినిమాని పట్టాలెక్కించబోతున్నారు. బాలయ్య సరసన ఈ చిత్రంలో ఓ కొత్త కథానాయిక సందడి చేయనున్నట్టు సమాచారం. ద్వారక క్రియేషన్స్‌  పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.