ఇంటర్నెట్ డెస్క్: దేశ సరిహద్దుల్లో భారత జవాన్‌గా ఉండటం అంత సులభం కాదని అంటున్నాడు రానా. తాను నటించిన ‘మిషన్ ఫ్రంట్‌లైన్’ డాక్యుమెంటరీ జవాన్లకు అంకితం చేస్తున్నట్టు పేర్కొన్నాడు. ఆ డాక్యుమెంటరీలో పనిచేయడం వల్ల మన సరిహద్దుల్లో కాపలాకాసే జవాన్ల గురించి ఒక దృక్పథం ఏర్పడిందని చెప్పాడు. ఈ డాక్యుమెంటరీలో జవాన్ల జీవన విధానాన్ని ప్రధానంగా చూపించబోతున్నామని తెలియజేశాడు. జనవరి 21 నుంచి ‘డిస్కవరీప్లస్ఇన్’లో ‘మిషన్ ఫ్రంట్‌లైన్’ ప్రసారం కానుందని తెలిపాడు.
ఇప్పటికే విడుదలైన ఈ ప్రోమో అందరినీ అలరిస్తోంది. డాక్యుమెంటరీలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డిస్నీప్లస్.. భారత జవాన్ల జీవన శైలిని ప్రేక్షకుల కళ్ల ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతో ఈ డాక్యుమెంటరీని తీర్చిదిద్దింది. కాగా.. ఈ డాక్యుమెంటరీ తెరకెక్కించేందుకు నేరుగా బీఎస్ఎఫ్ (బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్) సహాకారం తీసుకుంది. వాళ్ల సహాయంతోనే పలు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని చిత్రీకరణ పూర్తి చేసింది. రానా జవాన్‌గా కనిపించనున్నాడు. కాగా.. అక్కడ జవాన్లతో కలిసి ఉన్న తన అనుభవాలను రానా పంచుకున్నాడు.
‘‘భారతదేశ సరిహద్దు భద్రతా దళంలో ఉండటం అంత సులభం కాదు. వాళ్లకు సెలవులు, విరామాలుండవు. సరిగ్గా ఊపిరి తీసుకునేందుకు వీలు కూడా ఉండదు. వాళ్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తారు. లేకపోతే మన దేశమే ప్రమాదంలో పడిపోతుంది. విధుల్లో భాగంగా ప్రతిరోజూ కసరత్తులు, కాల్పులు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఆ హీరోల సాయంతో కఠిన శిక్షణ పొందాను. వాళ్లతో ప్రయాణం ఎంతో అమూల్యమైన అనుభూతినిచ్చింది. ఆ సమయంలో భారతదేశ గొప్పతనాన్ని ఆస్వాదించాను’’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం రానా వరుస సినిమాలతో తీరికలేకుండా ఉన్నారు. ‘అరణ్య’లో వినూత్నమైన పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్‌లో రానా నటించనున్న విషయం తెలిసిందే. వీటితో పాటు విరాట పర్వం, 1945, హిరణ్యకశ్యప సినిమాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి.
ఇదీ చదవండి..
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్
-
విజయేంద్ర ప్రసాద్ కొత్త చిత్రం ‘సీత’
-
ఆసక్తి రేపుతోన్న ‘పవర్ ప్లే’ట్రైలర్!
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
గుసగుసలు
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
- మలయాళీ రీమేక్‌లో శివాత్మిక?
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’