Akshay Kumar: ఆగస్టు 19న .. 2డి, 3డిలో ‘బెల్‌బాటమ్‌’  - bell bottom akshay kumar surprises fans by announcing 3d release of film
close
Published : 02/08/2021 17:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Akshay Kumar: ఆగస్టు 19న .. 2డి, 3డిలో ‘బెల్‌బాటమ్‌’ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘బెల్ బాట‌మ్’ చిత్రం విడుదల ఎప్పుడంటూ వేచి చూసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఆగస్టు 19న విడుదలంటూ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది ఆ చిత్ర బృందం. ఈ సందర్భంగా అక్షయ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రపంచవ్యాప్తంగా 2డి, 3డి ఫార్మాట్స్‌లో బెల్‌బాటమ్‌ సందడి చేయనుందని వెల్లడించారు. ఎం.తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వాణీ క‌పూర్‌, హ్యూమా ఖురేషీ, లారా దత్తా త‌దితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్‌, సంగీతానికి చక్కటి ఆదరణ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. 80ల కాలం నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఎక్కువశాతం బ్రిటన్‌లో చిత్రీకరణ జరుపుకొంది. మిస్టరీలను పరిష్కరించి దేశాన్ని కాపాడే పాత్రలో నటుడు అక్షయ్‌ కనిపించనున్నారు. పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఇమ్మీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చేతిలో అరడజన్‌కు పైగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు అక్షయ్‌. అందులో బెల్‌బాటమ్, సూర్యవంశీ, అత్రంగిరే, పృథ్వీరాజ్‌ ఈ ఏడాది విడుల కానున్నాయి. వచ్చే ఏడాది బచ్చన్‌ పాండే, రామ్‌సేతు సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని