భానుమతిని చూడగానే కళ్లు తిరిగి పడిన అభిమాని! - bhanumathi ramakrishna
close
Published : 13/03/2021 15:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భానుమతిని చూడగానే కళ్లు తిరిగి పడిన అభిమాని!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు సినీ తారలను కలిసేందుకు అభిమానులు వారి ఇంటి చుట్టూ క్యూ కట్టేవారు. ఇక అవుట్‌డోర్‌ షూటింగ్‌ అయితే, చిత్ర బృందం కచ్చితంగా భద్రతా సిబ్బందిని పెట్టుకోవాల్సి వచ్చేది. ఎన్టీఆర్‌ వంటి అగ్ర నటులు ఉదయాన్నే అభిమానులకు కాసేపు కనపడి, వీలైతే ముచ్చటించి షూటింగ్‌కు వెళ్లేవారు. అయితే, తమ అభిమాన తార నేరుగా ఇంటికి వచ్చి సర్‌ప్రైజ్‌ చేస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఇలాంటి సంఘటన ఓసారి చోటు చేసుకుంది.

భానుమతి చాలా ఏళ్ల క్రితం తెనాలిలో ఒక స్థలం కొన్నారు. కొన్నాళ్ల తర్వాత ఆ స్థలం రిజిస్ట్రేషన్‌ చేసిన అధికారి మద్రాసు వెళ్లి భానుమతిని కలుసుకొని, తానే స్థలం రిజిస్ట్రేషన్‌ చేసిన సంగతి చెప్పారు. ‘‘మీ అభిమానిని. మీరు నటించిన సినిమాలన్నీ చూస్తాను. మీరు ఎప్పుడైనా తెనాలి వస్తే వీలు చూసుకుని మా ఇంటికి రండి’’ అని, తన చిరునామా ఇచ్చాడు.

ఆ సమయంలో భానుమతి ఏ ఆలోచనలో ఉన్నారో గానీ, ఆ చిరునామా దాచి పెట్టారు. తర్వాత ఎప్పుడో తెనాలి వెళ్తే, ఆ రిజిస్ట్రార్‌ గుర్తుకు వచ్చి అతని చిరునామా కనుక్కొని నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. వేసిన తలుపు కొట్టగానే, రిజిస్ట్రార్‌ వచ్చి తలుపుతీసి, ప్రత్యక్షమైన భానుమతిని చూసి, అలాగే కళ్లు తిరిగి పడిపోయాడట! ‘‘నీళ్లు నీళ్లు’’ అని భానుమతి గట్టిగా అరిచి నీళ్లు తెప్పించి, ఆయన ముఖాన ఆవిడే చల్లారుట. దాంతో ఆయన తెప్పరిల్లి లేచి కూర్చున్నాడట! ఓ సందర్భంలో భానుమతి ఈ విషయాన్ని పంచుకుని ఒకటే నవ్వు!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని