Cinema news: బొమ్మరిల్లు భాస్కర్‌కు మరో బంపర్‌ ఆఫర్‌? - bhaskar to get one more big chance
close
Published : 25/10/2021 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema news: బొమ్మరిల్లు భాస్కర్‌కు మరో బంపర్‌ ఆఫర్‌?

హైదరాబాద్‌: చాలా సంవత్సరాల తర్వాత ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు ‘బొమ్మరిల్లు భాస్కర్‌’. అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం ఫీల్‌గుడ్‌ మూవీగా అలరిస్తోంది. ఇప్పుడు తాజాగా ఆయనకు మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. గీతాఆర్ట్స్ బ్యానర్‌లో మరో చిత్రం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త చిత్రాన్ని మెగా హీరోతో చేయనున్నారని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

‘బొమ్మరిల్లు’, ‘పరుగు’ తదితర చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న భాస్కర్‌ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తెలుగులో ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చేశారు. తొలుత అనుకున్న స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. కొన్ని సన్నివేశాలను రీషూట్‌ చేశారు. సినిమా సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత కూడా స్క్రిప్ట్‌లో అనేక మార్పులు చేశారు. దీనికి తోడు కరోనా కారణంగా సినిమా చిత్రీకరణ ఆలస్యమైంది. ఈసారి తెరకెక్కబోయే సినిమా విషయంలో భాస్కర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని