మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
‘డ్రీమ్’ సినిమాతో పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు దర్శకుడు భవానీ శంకర్. ఇప్పుడాయన తెరకెక్కించిన చిత్రం ‘క్లైమాక్స్’. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషించారు. మార్చి 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించారు శంకర్.
అందుకే ఆ పేరు..
ప్రేక్షకులకు కొత్తదనం పరిచయం చేయాలనే ఆలోచనలో పుట్టిందీ కథ. సాధారణంగా మర్డర్ మిస్టరీ అంటే మనందరికీ ఇన్వెస్టిగేషనే గుర్తొస్తుంది. దానికి భిన్నంగా మేం కామెడీ నేపథ్యంలో తెరకెక్కించాం. ఏ సన్నివేశంలోనూ రక్తపు మరకలు, విధ్వంసానికి చోటుండదు. అలా అని ఉత్కంఠ ఎక్కడా మిస్ అవ్వదు. ఇలా చేయడం ప్రయోగమనే చెప్పాలి. పొలిటికల్ సెటైరూ ఇందులో కనిపిస్తుంది. అసలు కథ మొత్తం పతాక సన్నివేశాల్లోనే రివీల్ అవుతుంది. అందుకే ‘క్లైమాక్స్’ అనే పేరు పెట్టాం.
మోదీ అంటే వాళ్లు కాదు..
ఈ చిత్రంలో విజయ్ మోదీ అనే పేరుకు చాలా ప్రాధాన్యం ఉంది. ట్ర్లైలర్ చూసిన వారంతా ప్రధాని నరేంద్ర మోదీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యాల గురించి చెప్తున్నాం అనుకుంటున్నారు. కానీ అలా ఏమీ ఉండదు. ఈ పేరుతో సెన్సార్ బోర్డు వద్ద కూడా సమస్య వచ్చింది. సినిమా చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు ఆ ప్రశ్న అడగలేదు. చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకులూ పాత్ర పేరు సరిగా పెట్టారు అనుకుంటారు.
అదే ట్విస్ట్..
60 ఏళ్ల వయసున్న ఓ కోటీశ్వరుడి కథ ఇది. పాపులర్ అవ్వడం, సినిమా తీయడం, రాజకీయాల్లోకి వెళ్లడం అతని కల. ఎప్పుడూ తాగుతూ.. అమ్మాయిలతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇల్లు వదిలేసి స్టార్ హోటల్లో బస చేస్తుంటాడు. తానుంటున్న గదిలో దాచిపెట్టిన రూ.500కోట్లు అకస్మాత్తుగా అతడు చనిపోయిన తర్వాత మాయమవుతుంది. అది ఎలా అనేది తెరపై చూడాల్సిందే.
ముందు సందేహపడినా..
ఈ కథ రాసుకున్నాక ఎవరు సరిపోతారు అనుకుంటున్న సమయంలో మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ మెదిలారు. చర్చల అనంతరం రాజేంద్ర ప్రసాద్ ఎంపికయ్యారు. ఇలాంటి విభిన్న పాత్ర పోషించేందుకు ముందుగా ఆయన కాస్త సందేహ పడినా డైలాగులు విని ఓకే చేశారు. ప్రతి మాటా బాగా ఆలోచించి రాశాను. సన్నివేశాలన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఆ వయసులోనూ పాత్రకు తగ్గట్టు మారడంలో ఆయన ఓపికకు మెచ్చుకోవాలి. ఇందులో శ్రీరెడ్డిది అతిథి పాత్ర. ఈ చిత్రంలో సినిమాను తెరకెక్కించే సన్నివేశాలుంటాయి. ఓ కాంట్రవర్సీ హీరోయిన్ పాత్ర ఉంటుంది. అందులోనే శ్రీ రెడ్డి కనిపిస్తుంది. డబ్బున్నోళ్లకి ఎలాంటి కష్టాలుంటాయో ఓ పాట రూపంలో తెలియజేశాం. రాజేంద్ర ప్రసాదే ఆలపించారు. తక్కువ నిడివి (గంటన్నర)తో కొత్త నేపథ్యమున్న సినిమా తీసి ప్రయోగం చేశాం. ఇది విజయం అందుకుంటే ట్రెండ్ అవుతుందని, సమయం తక్కువ అవడం వల్ల చాలా ఉపయోగాలున్నాయని భావిస్తున్నా.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను
- వీరభద్రం దర్శకత్వంలో ఆది
-
Gully Rowdy Teaser: నవ్వులే నవ్వులు
గుసగుసలు
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
-
‘రాధేశ్యామ్’లో పూజా పాత్ర అదేనా?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
కొత్త పాట గురూ
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?