bigg boss 5: ఇక్కడ ఉన్నది మనుషులు.. ఇన్‌స్టాంట్‌ నూడిల్స్‌ కాదు.. ఈ వారం వెళ్లిపోతావేమో! - bigg boss telugu 5 day 45 in the house
close
Updated : 21/10/2021 07:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

bigg boss 5: ఇక్కడ ఉన్నది మనుషులు.. ఇన్‌స్టాంట్‌ నూడిల్స్‌ కాదు.. ఈ వారం వెళ్లిపోతావేమో!

bigg boss telugu 5: కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో భాగంగా, ఎవరెక్కువ డ్రెస్సులు ధరిస్తే వాళ్లకు అదనంగా 5 గుడ్లు వస్తాయని బిగ్‌బాస్‌ తెలిపాడు. దీంతో విశ్వ, కాజల్‌ పోటీ పడ్డారు. హౌస్‌లో ఉన్న వాళ్ల దుస్తులన్నీ వీరిద్దరూ ధరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాజల్‌ 79 దుస్తులు ధరించగా, విశ్వ 106 దుస్తులు ధరించి విజేతగా నిలిచాడు. ఫిజికల్‌ టాస్క్‌లో తానెంత బలవంతుడో మరోసారి నిరూపించాడు.

జెస్సీకి సీక్రెట్‌ టాస్క్‌

ఈ క్రమంలో బిగ్‌బాస్‌ జెస్సీకి సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఎవరైనా ముగ్గురు ఇంటి సభ్యుల వద్ద గుడ్లు లేకుండా చూడాలని సూచించాడు. ఈ విషయాన్ని ఒకరితో పంచుకోవచ్చని చెప్పగా, షణ్ముఖ్‌ తనకు బాగా క్లోజ్‌ అయినా, అతనికి చెప్పకుండా సిరికి చెప్పాడు. దీంతో షణ్ముఖ్‌, ప్రియాంక, ప్రియల దగ్గరి నుంచి సిరి గుడ్లు తీసుకునే ప్రయత్నం చేసింది. ఇక బిగ్‌బాస్‌ గుడ్ల వర్షం ఎప్పుడు కురిపిస్తాడా? అని అందరూ ఆశగా ఎదురు చూడటం కనిపించింది. అందరూ నిద్రపోయిన తర్వాత జెస్సీ దగ్గరున్న మూడు గుడ్లను సన్నీ దొంగిలించాడు.

సన్నీ VS ప్రియ

కోడిగుడ్లను సేకరించే క్రమంలో సన్నీ-ప్రియల మధ్య తీవ్ర మాటల యుద్ధమే జరిగింది. సేకరించిన గుడ్లను ఓ బుట్టలో పెట్టి.. మరిన్ని గుడ్ల కోసం సన్నీ ప్రయత్నిస్తుండగా.. ఆయన దాచుకున్న వాటిని ప్రియ దొంగిలించింది. ‘‘నాకు బుట్ట దొరికింది’’ అంటూ ప్రియ.. సన్నీ దాచుకున్న కోడిగుడ్లు దొంగిలిస్తుండగా.. వెంటనే అక్కడికి చేరుకున్న సన్నీ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ‘ప్లీజ్‌ నా గుడ్లను కాపాడుకుంటున్నా’ అని బల్ల మీద పడగా, సన్నీ వేలు నలిగిపోయింది. అక్కడే ఉన్న ప్రియ పట్టుకోల్పోయి పడిపోబోయింది. సన్నీ తనని తోశాడనుకుని పూలకుండీ ఎత్తి ‘ఫిజికల్‌ అయితే, చెంప పగిలిపోతుంది’ అని వార్నింగ్ ఇవ్వడంతో సన్నీ కోపాన్ని ఆపుకోలేకపోయాడు.‘‘నోరు పారేసుకోకు. కష్టపడి సొంతం చేసుకున్న వాటిని ఇలా చేస్తే ఊరుకోవాలా?’’ అని సన్నీ.. ప్రియపై కేకలు వేశారు. ‘‘నా ఇష్టం. నా గేమ్‌ ఇదే. మీరు అర్ధరాత్రిపూట దొంగతనం చేస్తే.. దొంగతనం కాదు. కష్టపడి ఆడినట్లు’’ అంటూ ఆమె దీటుగా సమాధానమిచ్చింది. ఆ మాటలతో మరింత కోపానికి గురైన సన్నీ.. ‘‘ఆట ఆడటం కూడా చేతకాదు. చేతకాని వారు వస్తారు ఇక్కడికి’’ అని అనగా.. ‘‘ఏయ్‌.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెంప పగిలిపోతుంది’ అని ప్రియ మాటల దాడికి దిగారు. దీంతో సన్నీ.. ‘‘ఇంకోసారి చెంప పగిలిపోతుందంటే బాగోదు. దమ్ముంటే కొట్టు’’ అంటూ ప్రియతో యుద్ధానికి దిగాడు. సన్నీని మానస్‌, ప్రియను ప్రియాంక ఆపే ప్రయత్నం చేశారు.

సన్నీ మాట్లాడకుండా ఆగిపోయినా, ప్రియ తన మాటలతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో సన్నీకి సపోర్ట్‌గా నిలిచిన కాజల్‌పైనా నోరు పారేసుకుంది. దీంతో కాజల్‌ కన్నీటి పర్యంతమైంది. ఈ విషయం తెలిసిన సన్నీ ‘కాజల్‌ను దూరంగా పెడతా. నా వల్ల తనపై మాటలదాడి జరుగుతోంది’ అంటూ మానస్‌ ఎదుట వాపోయాడు. గొడవ సద్దుమణిగిన తర్వాత కూడా ప్రియ వచ్చి సన్నీ బుట్టను విసేరిసింది. ‘నా ఇష్టం నేను గేమ్‌ ఇలాగే ఆడతా’ అంటూ బుట్టలోని గుడ్లను లాగేందుకు ప్రయత్నించింది. ఇంతలో అక్కడకు వచ్చిన సిరి సన్నీ గుడ్లను లాక్కునేందుకు ప్రయత్నించింది. దీంతో సిరి-సన్నీ కలబడ్డారు. ‘సిరి నువ్వు బాగా హర్ట్‌ అవుతావు. ప్లీజ్‌ వదిలేయ్‌. ఆడవాళ్ల జోలికి నేను రాను’ అని సన్నీ బతిమిలాడాడు. అయినా, అతని బుట్టలోని గుడ్లను తీసేందుకు సిరి ప్రయత్నించింది. అనంతరం కింద పడిపోయిన సన్నీ గుడ్లను ప్రియ తీసుకెళ్లి జెస్సీకి ఇచ్చింది.

జెస్సీ Vs సన్నీ

‘‘నేను సేకరించిన గుడ్లను ఇచ్చిన వాళ్లకు థ్యాంక్స్‌ చెప్పావు.. మరి, నాకు కూడా థ్యాంక్స్‌ చెప్పు’’ అని సన్నీ అనడంతో ‘‘నీకెందుకు చెబుతాను?’’ అంటూ జెస్సీ కోపంతో ఊగిపోయాడు. దీంతో ఇద్దరూ కాసేపు గొడవ పడ్డారు. మధ్యలో సిరి వచ్చి మాట్లాడటం సన్నీకి ఇంకాస్త కోపం తెప్పించింది. ఇలా, హౌస్‌లో ఓవైపు మాటల యుద్ధాలు జరుగుతుండగా.. శ్రీరామ్‌-ప్రియాంకల మధ్య ప్రేమ సంభాషణలు జరిగాయి. ‘‘ఇక, నేను గేమ్స్‌ ఆడలేను, నీతో సెటిల్‌ అయిపోతాను’’ అని ప్రియాంక.. శ్రీరామ్‌ చేతుల్ని పట్టుకుని వదల్లేదు. అనంతరం, శ్రీరామ్‌-ప్రియాంకల మధ్య సిరి గురించి సరదా సంభాషణ కొనసాగింది. ‘‘సిరిది ఉప్మా మొహం. మాడిపోయిన చపాతీ’ అంటూ ప్రియాంక కామెంట్‌ చేసింది. మరోవైపు, ఎవరు ఎవరిని టార్గెట్‌ చేస్తున్నారన్న దానిపై సన్నీ, కాజల్‌, మానస్‌ల మధ్య చర్చ నడిచింది. ‘‘ఇంట్లో ఉన్న వాళ్లందరూ మనుషులు.. ఇన్‌స్టాంట్‌ న్యూడిల్స్‌ కాదు. సర్దుకోవడానికి సమయం పడుతుంది’’ అని మానస్‌ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇదే విషయమై రవి-కాజల్‌ మధ్య కూడా చర్చ నడిచింది. ‘‘నువ్వు, సన్నీ ఫ్రెండ్స్‌ కాబట్టి ప్రియ నిన్న టార్గెట్‌ చేస్తోంది. హైలైట్‌ ఏంటంటే.. సన్నీ దగ్గర గుడ్లు కొట్టేసి, మానస్‌కు ఇస్తోంది’’ అని కాజల్‌కు రవి చెప్పే ప్రయత్నం చేశాడు.

ఈ వారం వెళ్లిపోతావేమో!

ఇక సన్నీ-సిరిల మధ్య గుడ్ల కోసం జరిగిన పోటీలో మరో అమ్మాయి ఉంటే ‘‘నా చేయి విరిగిపోయింది. నన్ను అలా చేశారు.. ఇలా చేశారు అని ఏడ్చేది. నువ్వు పోటీగా తీసుకున్నావు. ఈ వారం నిన్ను తీసేస్తే, తీసేయొచ్చు’’ అని సిరితో షణ్ముఖ్‌ అనగా, ‘‘ఏడు వారాలు ఉన్నాను. వెళ్లిపోతే పోతా’’ అని సిరి క్యాజువల్‌గా తీసుకుంది. దాచేసిన సిరి స్టిక్కర్స్‌ విషయంలో రవితో ఆమెకు డీల్‌ కుదిరింది. తాను నిద్రపోయినప్పుడు ఎవరైనా గుడ్లు దొంగిలిస్తారని వాటిని తీసుకెళ్లి కోడిపక్కన పెట్టానని రవికి విశ్వ చెప్పాడు. ఇక స్పెషల్‌ గుడ్డు దొరకడంతో శ్రీరామ్‌-అనీ మాస్టర్‌ బాతు టాస్క్‌ ఆడారు. ఇందులో అనీ మాస్టర్‌ గెలిచారు. మరి ఈ కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు గెలిచారు? ఎవరు ఇంటి కొత్త కెప్టెన్‌ అయ్యారో తెలియాంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే!


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని