bigg boss 5: రవి ప్లాన్‌కు శ్వేత బలైందా? లేదా తనే తప్పు చేసిందా? - bigg boss worst contestant of this week
close
Published : 16/10/2021 09:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

bigg boss 5: రవి ప్లాన్‌కు శ్వేత బలైందా? లేదా తనే తప్పు చేసిందా?

హైదరాబాద్‌: ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’లో నామినేషన్స్‌ తర్వాత ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న కార్యక్రమం ‘హౌస్‌లో వరెస్ట్‌ ఫెర్ఫార్మర్‌ ఎవరు?’. ఎప్పట్లాగే ఈ వారం కూడా  హౌస్‌మేట్స్‌ మధ్య మరోసారి ఆసక్తికర చర్చ జరిగింది. అయితే, అంతకుముందు ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్‌లో అన్నం ఉడుకుతుండగా, దాన్ని తీసి పక్కన పెట్టేసి హాట్‌వాటర్‌ పెట్టుకుంది శ్వేత. ఈ విషయమై ప్రియ-శ్వేతల మధ్య చిన్న వాగ్వాదం నడిచింది. మైక్‌ సరిగా ధరించమని ప్రియాంకకు బిగ్‌బాస్‌ సూచించడంతో కెప్టెన్‌ విశ్వ ఆమెకు శిక్ష విధించాడు. సాయంత్రం వరకూ మానస్‌తో మాట్లాడకూడదని ఆదేశించాడు. ‘వీక్‌ పాయింట్‌ మీద కొట్టద్దు అన్నయ్యా’ అంటూ ప్రియాంక వేడుకుంది. సిరి, షణ్ముఖ్‌, జస్వంత్‌లు మోజో రూమ్‌లో చేరి ముచ్చట్లు మొదలు పెట్టారు. ఆ తర్వాత  హౌస్‌లో లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ జరిగింది. ‘పగలకొట్టు.. ఐటమ్‌ పట్టు’ అంటూ నిర్వహించిన వివిధ గేమ్‌లు వినోదాత్మకంగా సాగాయి.

అలా శ్వేత నామినేట్‌..

‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ టాస్క్‌లో సభ్యులతో పాటు, సంచాలకులను మిస్‌లీడ్‌ చేసిన రవి, లోబో, శ్వేతలు ఈసారి వరెస్ట్‌ పెర్ఫార్మర్స్‌గా ఎక్కువమంది ముద్ర వేశారు. టాస్క్‌లో రవి ఇచ్చిన ఐడియా నచ్చలేదని విశ్వ అతన్ని నామినేట్‌ చేయగా, రవి వల్ల తాను బిగ్‌బాస్‌తో తిట్లు తిన్నానని, అందుకే కెప్టెన్‌ అయ్యే అర్హత కోల్పోయానని కాజల్‌ చెప్పుకొచ్చింది. ఇక ప్రియ, ప్రియాంక, షణ్ముఖ్‌, లోబోలు శ్వేతపై వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ ముద్రవేశారు. జస్వంత్‌, అనీ మాస్టర్‌, శ్వేతలు లోబోపై వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ ముద్రవేయగా, సంచాలకురాలిగా సిరి యాటిట్యూడ్‌ నచ్చలేదని సన్నీ, మానస్‌ ఆమెను నామినేట్‌ చేశారు. ఈ వారం జస్వంత్‌ ఎక్కడా కనపడలేదని రవి అతడిని నామినేట్‌ చేశాడు. అత్యధిక ఓట్లు పడిన శ్వేత వరెస్ట్‌ పెర్ఫార్మర్‌గా జైలుకు వెళ్లింది. రవి చెప్పడం వల్లే తాను కుషన్‌లోని దూది తీసుకున్నానని శ్వేత చెబుతుండగా, అది ఆమె ఐడియానేనని రవి అంటున్నాడు. మరి ఈ ఐడియా ఎవరు చెప్పారో తెలియాలంటే ఈరోజు నాగార్జున వీడియో చూపించాల్సిందే!


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని