‘ఐ’లో ఈ సీన్లు ఎలా తీశారంటే? - bike transformation i film vfx
close
Published : 13/03/2021 16:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఐ’లో ఈ సీన్లు ఎలా తీశారంటే?

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయ చిత్ర పరిశ్రమను ప్రపంచస్థాయిలో మాట్లాడుకునేలా చేసిన దర్శక దిగ్గజాలు ఎంతో మంది ఉన్నారు. వారిలో శంకర్‌ కూడా ఒకరు. ఇక సినిమా, అందులోని పాత్ర కోసం ప్రాణం పెట్టి మరీ తమను తాము మార్చుకునే నటుల్లో విక్రమ్‌ ముందుంటారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అపరిచితుడు’ భారీ హిట్‌ అందుకుంది. ఆ తర్వాత ‘ఐ’తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది ఈ కాంబో. కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించినా, బాక్సాఫీస్‌ వద్ద ఇంపాక్ట్‌ను క్రియేట్‌ చేయలేకపోయింది.

తన సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు శంకర్‌. అలా ఇందులోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. లింగేశగా విక్రమ్‌ తమ ప్రత్యర్థులను పగతీర్చుకునే ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఇక ‘పరేషనయ్యా..’ సాంగ్‌లో అమీజాక్సన్‌ వివిధ రూపాల్లో మారే సీన్‌లు భలే అనిపిస్తుంది. ముఖ్యంగా బైక్‌గా మారడం సరదాగా ఉంటుంది. అలాగే, తేనెటీగలు దాడి చేసే సీన్‌ ఇవన్నీ వీఎఫ్‌ఎక్స్‌ సృష్టే. ప్రముఖ వీఎఫ్‌ఎక్స్‌ నిపుణులు శ్రీనివాసమోహన్‌ ఆధ్వర్యలో ఆయా సన్నివేశాలను తీర్చిదిద్దారు. వాటిని ఎలా తీర్చిదిద్దారో మీరూ చూసేయండి.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని