close
Published : 21/01/2021 21:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మెరుపు కాంబినేషన్లు..విజయ వీచికలు

ముంబయి: సినిమా బాగా పండాలంటే కథ బాగుండాలి. దర్శకుడు, కథానాయకుడి మధ్య కెమిస్ట్రి కుదరాలి. అలా కుదిరి ఓ సినిమా హిట్‌ అయితే ఆ కాంబినేషన్‌లోనే సినిమాలు వస్తూనే ఉంటాయి. అలాగని వారి చిత్రాలే హిట్‌ కావడం లేదు. క్రేజీ డైరెక్టర్, స్టార్‌ యాక్టర్‌ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాలూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. అలాంటి కొత్త కాంబినేషన్లు ఈ ఏడాది ఎక్కువగానే ఉన్నాయి. 2021లో తొలిసారి కలిసి పనిచేస్తున్న దర్శకులు, హీరోలు, హీరోయిన్‌లు ఎవరు? ఎలాంటి చిత్రాలతో అలరించనున్నారో చూద్దాం.

‘వార్‌’ చిత్రంతో 2019లో భారీ విజయాన్ని అందుకున్న సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఇప్పుడు షారుఖ్‌ ఖాన్‌తో ‘పఠాన్‌’ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ కథల్ని తెరకెక్కించడంలో పేరున్న సిద్ధార్థ్‌ ఈ చిత్రాన్ని షారుఖ్‌ అభిమానుల్ని అలరించేలా తీర్చిదిద్దే పనిలో ఉన్నాడట. పైగా ‘జీరో’ తర్వాత షారుఖ్‌ నుంచి సినిమా రాలేదు. ‘జీరో’ ప్లాఫ్‌ అయింది. దాంతో ‘పఠాన్‌’పై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

ప్రముఖ దర్శకనిర్మాత ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో తొలిసారి నటిస్తున్నారు ప్రముఖ  బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌కుమార్‌. ఈ ఇద్దరు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘అతరంగీ రే’. ఈ చిత్రంలో అక్షయ్‌తో పాటు ధనుష్, సారా అలీఖాన్‌ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది.

‘ఉరి: ది సర్జికల్‌ స్టైక్‌’తో స్టార్‌ హీరోగా ఎదిగిన విక్కీ కౌశల్‌ ఈ ఏడాది ఇద్దరు క్రేజీ దర్శకులతో తొలిసారి పనిచేయబోతున్నాడు. సూజిత్‌ సర్కార్‌తో ‘సర్దార్‌ ఉదమ్‌ సింగ్‌’ చిత్రం చేస్తున్నాడు. విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఓ కామెడీ చిత్రంలో నటించబోతున్నాడు విక్కీ.

‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ లాంటి భారీ హిట్‌ అందించిన శకున్‌ బత్రా దర్శకత్వంలో నటిస్తోంది బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె. మరో బాలీవుడ్‌ యువ కథానాయిక ఆలియా భట్‌ ఈ ఏడాది తొలిసారి ఇద్దరు స్టార్‌ దర్శకులతో పని చేస్తుంది. సంజయ్‌ లీలా భన్సాలీతో ‘గంగూబాయి కతియావాడి’ చిత్రంలో వేశ్యగా నటిస్తోంది. అలాగే ఎస్‌.ఎస్‌.ఎస్‌.రాజమౌళి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో సీత పాత్రలో నటిస్తోంది ఆలియా. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

‘కబీర్‌ సింగ్‌’తో బాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. ఆయన దర్శకత్వంలో యువ కథానాయకుడు రణ్‌బీర్‌కపూర్‌ తొలిసారి నటిస్తున్న చిత్రం ‘యానిమల్‌’.

‘కేదార్‌నాథ్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న అభిషేక్‌ కపూర్‌తో కలిసి తొలిసారి పనిచేస్తున్నారు యువ హీరో ఆయుష్మాన్‌ ఖురానా. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రానున్న చిత్రం ‘చండీగఢ్‌ కరే ఆషికీ’.

ఇదీ చదవండి

పెళ్లి ప్లాన్స్‌ బయటపెట్టిన తాప్సీ

 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని