రాజమౌళి ప్రకటన పట్ల బీటౌన్ నిర్మాత అసంతృప్తి
హైదరాబాద్: రామ్‌చరణ్, తారక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ వివాదానికి తెరలేపింది. ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తేదీ పట్ల బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అజయ్ దేవ్‌గణ్ హీరోగా తాను నిర్మించిన ‘మైదాన్’ చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ఆరు నెలల ముందే ప్రకటించినప్పటికీ అదే నెలలో 13న ‘ఆర్ఆర్ఆర్’ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమకు పూర్వవైభవం తెచ్చేందుకు అందరూ కలిసికట్టుగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు బోనీకపూర్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆర్ఆర్ఆర్’ విడుదల గురించి స్పందిస్తూ.. ‘నిజం చెప్పాలంటే RRR విడుదల పట్ల నేనెంతో అసంతృప్తిగా ఉన్నాను. ఇది అన్యాయం. ‘మైదాన్’ విడుదల తేదీని నేను ఆరు నెలల క్రితమే ప్రకటించాను. అందరం ఒక్కటిగా ఉండి చిత్ర పరిశ్రమను కాపాడాల్సిన ఈ సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఇలా చేయడం నాకు నచ్చలేదు.’ అని బోనీ వెల్లడించారు.
రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు అజయ్‌దేవ్‌గణ్ కీలకపాత్రను పోషిస్తున్నారు. మరోవైపు ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘మైదాన్’లో అజయ్‌దేవ్‌గణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియన్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘మైదాన్’కు అమిత్ రవింద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవీ చదవండి
‘ఆచార్య’.. బిగ్ అనౌన్స్మెంట్
ఆర్ఆర్ఆర్: రిలీజ్ డేట్ ఫిక్స్
మరిన్ని
కొత్త సినిమాలు
-
టీజర్‌తోనే అదరగొట్టిన ‘టక్ జగదీష్’
-
‘తెల్లవారితే గురువారం’.. వినూత్న ప్రచారం
- ఎవరూ ఊహించని సస్పెన్స్ ‘క్షణక్షణం’లో ఉంటుంది
-
‘రంగ్ దే’.. గుమ్మడికాయ కొట్టేశారు
- ‘పీఎస్పీకే 27’.. ఫస్ట్‌లుక్, టైటిల్ ఆరోజే
గుసగుసలు
- 15ఏళ్ల తర్వాత మెగాస్టార్‌కు జోడీగా ఆ భామ?
- ఆ ఇద్దరిలో ‘దళపతి 66’ దర్శకుడెవరు?
- RRR: ఆలియాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు.!
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- ఎన్టీఆర్‌ను ఢీకొట్టనున్న మక్కళ్ సెల్వన్..!
రివ్యూ
ఇంటర్వ్యూ
- నా నటనతో... ఆ పేరు మార్చేసుకుంటా!
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘నాలో ఆర్ట్‌ని గుర్తించింది పవన్ కల్యాణే’
-
నా బ్రెయిన్లో 9 టైటానియం తీగలున్నాయి!
- అందరి జీవితాలకు అన్వయించుకోవచ్చు
కొత్త పాట గురూ
-
ఇదీ.. జాతి రత్నాల కథ
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
‘చెక్’మేట్‌తో ఒక డ్యూయెట్!
-
ఫిఫిఫీ..ఫిఫీ..అంటున్న గాలిసంపత్!